Home సినిమా జనవరి 29న ఎంగేజ్‌మెంట్?

జనవరి 29న ఎంగేజ్‌మెంట్?

coupleఅక్కినేని ఇంట పెళ్లిళ్ల సందడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కినేని నాగార్జున ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయిన విషయం తెలిసిందే. అఖిల్-శ్రేయా భూపాల్‌ల నిశ్చితార్థం పూర్తయిపోగా ఈ ప్రేమ జంటకు చెందిన రెండు కుటుంబాల్లో పెళ్లిపనులు కూడా మొదలుపెట్టేశారు. అయితే అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అంశం ఉంది. నాగచైతన్య-సమంతల వివాహం ఖాయమే అయినా అందుకు సంబంధించిన వివరాల కోసం ఆసక్తి నెలకొంది. కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటు న్న ఈ జంట అఖిల్ నిశ్చితార్థం వేడుకలో కలిసి సందడి చేశారు కానీ… వారి నిశ్చితార్థం వివరాలను మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది. వచ్చే ఏడాది జనవరి 29న నాగచైతన్య, సమంతల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరుపనున్నారట. ఇప్పటికే చైతన్య నిశ్చితార్థానికి సంబంధించిన పనులు మొదలైపోగా… నాగార్జున ఈ పనుల్లోనే బిజీగా ఉన్నాడట. అఖిల్ నిశ్చితార్థం, వివాహం మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండటానికి కారణం… మధ్యలో చైతన్య, సమంతల ఎంగేజ్‌మెంట్ పూర్తి చేయడానికే అంటున్నారు. జనవరి నెలాఖరులో వీరి నిశ్చితార్థం పనులు పూర్తిచేశాక… అఖిల్ పెళ్లి పనులు మొదలుపెడతాడట నాగార్జున. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేయబోతున్న అఖిల్-శ్రేయాల పెళ్లి మాదిరిగానే… చైతన్య-సమంతల వివాహాన్ని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్‌గానే ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం కూడా తెలియరానుంది.