Home ఎడిటోరియల్ ఇంజినీరింగ్ బి-కేట‘గిరీ’

ఇంజినీరింగ్ బి-కేట‘గిరీ’

డా॥జి. అర్జున్
రీడర్, భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ, హైదరాబాద్

Instrumentation-Engineeringఇంజనీరింగ్ కళాశాల్లోయాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానం ఈ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చి ంది. మొదట్లో ఇంజనీరింగ్ సీట్లన్నీ కన్వీనర్ కోటా ద్వా రానే భర్తీ చేశారు. చంద్రబాబు నాయుడుగారు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఇంజనీరింగ్ విద్య ట్యూషన్ ఫీజు ను పెంచాలని కళాశాలల యాజమాన్యాలు కో రిన ప్పు డు ఫీజు పెంచడానికి బదులుగా కళాశాలల్లోని మొ త్తం సీట్లను 70:30శాతం విభజించి 70 శాతం సీట్లు కన్వీ నర్ కోటా ద్వారా30 శాతం సీట్లు అధిక ఫీజుతో యాజమాన్యాలు స్వయంగా భర్తీ చేసుకునే విధానం ఆరంభం అయ్యింది. దీనికే యాజమాన్య కోటా లేదా ‘బి’ క్యాటగిరి సీట్లుగా చెబుతారు. ప్రభుత్వ, ఇంజనీరింగ్ వి ద్యా సంస్థల మధ్య కుదిరినధికార అంగీకారం ప్రకా రం విద్యా సంస్థలు తమకు చెందిన ‘బి’ క్యాటగిరీ సీట్లను ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) సంబంధించిన సీ ట్లను తమ ఇష్టానుసారంగా భర్తీ చేసుకునే వెసులు ఆటు ను ప్రభుత్వమే అనధికారంగా అంగీకరించిందని చెప్పవ చ్చు. ప్రభుత్వ ఫీజు పెంచదు, కాలేజీలు ఇష్టారీతిగా సీ ట్లను అమ్ముకునే స్వేచ్ఛవుండటం అనే పరస్పర ప్రయో జన కాపురం 2009 సం॥ వరకు కొనసాగింది.
20 09 సంవత్సరపు సాధారణ ఎన్నికలను ఎదుర్కో వడంలో భాగంగా వార్షికాదాయం లక్ష లోపు గల వా రం దరికీ అన్ని కోర్సులకు పూర్తి స్కాలర్‌షిప్ ప్రభుత్వమే భరి స్తుందని డా॥ రాజశేఖర్‌రెడ్డి గారి ప్రభుత్వ ప్రకటిం చింది. 2009 సంవత్సరానికి ముందు ఎస్‌సి, ఎస్‌టి, బి సిలకు మాత్రమే పరిమితమైన స్కాలర్‌షిప్ విధానాన్ని ఒసిలతో సహా అందరికి వర్తించేలా మార్చారు. ఎన్నికల తరు వాత రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం అనంతరం వచ్చి న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విద్యా సంవత్సరం ముగి సిన తర్వాత కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపో వడం వలన, ఆ కళాశాలలు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదు ర్కొని తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించ డం, ప్రస్తుత ఫీజులతో కళాశాలలను నడపలేమని ఫీజు లు పెం చాలని ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం, ఇంజ నీరింగ్ కళాశా లల మధ్య సఖ్యత చెడింది. ఇతర కళాశా లలు అనగా ఎంబిఎ, ఎంసిఎ, బి ఫార్మసి సాంప్రదాయ డిగ్రీ కోర్సులు అనేకం ఉన్నప్పటికి కేవలం ఇంజనీరింగ్ కాలేజీలు మా త్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభు త్వంతో తలపడటం వెనుక నిజంగా ఆర్థిక ఇబ్బం దు లున్నాయో మరే వైనా కారణాలున్నాయా అన్నది పరి శో ధిం చాల్సిన అంశం ప్రభుత్వం, కోర్టులు ఈ అంశా న్ని పరిగణనలోకి తీసుకొని తమ తీర్పులను ఇవ్వాలని సమాజం ఆత్రుతతో ఎదురుచూస్తున్నది. సంవత్సరా లుగా రాష్ట్ర ప్రజల నుంచి డ బ్బులు వసూలు చేసుకొనే అ వకాశం ఇంజనీరింగ్ కళా శా లలకు కల్పించిన ప్రభు త్వాల నిర్వాకం ఫీజు రీయిం బర్స్‌మెంట్ పేరున జరిగిన ప్రజాధన దుర్వినియోగం, కళా శాలలు నడపడం ఆర్థి కంగా గిట్టుబాటుకాదు అంటు న్న ఇంజనీరింగ్ కళా శాలల వాదన, జిఒ 67, జిఒ 74లను అర్థవంతంగా ప్ర భు త్వాలు అమలు చేయలేకపో వడం మొదలైన అం శాలు ఎంతవరకు సమంజసం అని పరిశీలిస్తే ఈ క్రింది అంశాలు బోధపడతాయి.
‘ఎ’ క్యాటగిరిలో సీటు పొందాలంటే మూడు వేల లో పు ర్యాంక్ తప్పనిసరిగా వున్న హైదరాబాద్‌లో టాప్ 10 కాలేజీలలో దాదాపుగా 2లక్షల ర్యాంకు వచ్చిన వా రికి కూడా ‘బి’ క్యాటగిరి సీటు రావడం నిబంధనలు ఉల్లం ఘిస్తూ సీట్లు భర్తీ చేశారనడానికి స్పష్టమైన ఆ ధారం. ఎంసెట్ నోటిఫికేషన్ ముందే ‘బి’ క్యాటగిరీ సీ ట్లను భర్తీ చేయరాదన్న నిబంధనను ఏ కాలేజీ పాటిం చడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలలోనే అడ్మిషన్లు జరిగిన విషయం విచారణ జరిపితే తెలుస్తుంది. అడ్మిషన్ షెడ్యూ ల్ కు రెండు పాపులర్ దినపత్రికలలో ప్రకటించాలన్న మ రో నిబంధనను కూడా కళాశాలలు ఉల్లంఘిస్తు న్నాయి. అప్లికేషన్లు ఏ రోజు నుంచి అమ్ముతారు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, తమ కళాశాల మైనారిటీ కాలేజీనా కా దా మొదలైన వివరాలను నోటిఫికేషన్‌లో ఇవ్వకపో వడంతో ‘బి’ క్యాటగిరీ అడ్మిషన్స్ విషయంలో కళాశాలల ఉద్దే శాన్ని గుర్తించవచ్చు. ‘బి’క్యాటగిరీ సీట్లకు సం బంధించిన రూల్ 6(ii) ప్రకారం ప్రవాస భారతీయులు, వా రు స్పాన్సర్ చేసినవారు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపా లిత ప్రాంతాలకు చెందిన ఎఐఇఇఇ ర్యాంకుల వారు అ ర్హులు అనగా రాష్ట్ర విద్యార్థులే కాకుండా దేశమంతట విద్యార్థులు అర్హులు కనుక ఈ అడ్మిషన్లకు సంబంధించిన పేపర్ నోటిఫికేషన్ దేశం మొత్తం ప్రచురితమవుతున్న పే పర్లలో ప్రకటించడం తప్పనిసరి. కాని ఆ నిబంధనను పాటి స్తున్న కాలేజీలు తక్కువ. గతంలో కేవలం వైజాగ్, కరీంనగర్, సూర్యాపేట్ ఎడిషన్స్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన కాలేజీలున్నాయి. లేట్ సిటీ ఎడిషన్ లేదా హైదరాబాద్ ఎడిషన్ మాత్రమే ఇచ్చిన కాలేజీలు కూడా వున్నాయి. ఈ ఒక్క కారణంగానే కళాశాల అడ్మిషన్లను రద్దు చేసే అధి కారం ప్రభుత్వం/స్టేట్ కౌన్సిల్‌కు కలుగుతున్నది. ఈ నిబంధనను ఎందుకు ఉల్లంఘిస్తున్నారన్నదానిపై సంజా యిషీ కూడా అడగడకపోవడం బాధాకరం.
అడ్మిషన్ షెడ్యూల్ ప్రకటించడంలో గోప్యత పాటి స్తున్న కళాశాలలు తమ కాలేజీ మెరిట్ లిస్ట్‌ను కళాశాల వె బ్‌సైట్‌లో కనీసం రెండు వారాలు అందుబాటులో వుం చాలన్న ఈ నిబంధనను కూడా ఉల్లంఘిస్తున్నాయి. ఈ ఉల్ల ంఘన ఆధారం కూడా రాష్ట్ర ప్రభుత్వం/స్టేట్ కౌన్సి ల్‌లకు మొత్తం అడ్మిషన్ ప్రక్రియను రద్దు చేసే అధికారం ఉంది. రూల్ 6 2(ii) ప్రకారం ప్రతి కాలేజీ అడ్మిషన్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను కాలేజ్ వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించి, దానికి సంబం ధించిన రోజువారీ సమాచారం అనగా అభ్యర్థి పేరు, అడ్రస్, ఏ బ్రాంచ్‌కు అప్లై చేశాడు, ఫోన్ నెంబర్ మొ ద లైనవి నమోదు చేసి ఉంచాలి. అధికారులు ఎప్పుడు కో రితే అప్పుడు వారికి ఆ రికార్డులనను చూపించాలి. కానీ కాలేజీలు దీనిని కూడా ఉల్లంఘి స్తున్నాయి. అప్లికేషన్లు వెబ్‌సైట్‌లో కాలేజీ కౌంటర్స్‌లో ఉండాలని రూల్ 6 2 (ii) స్పష్టంగా చెబుతున్నప్పటికీ చా లా కాలేజీలు కాలే జీకి 20-30కి.మీ దూరంలో కా ర్పొరేట్ ఆఫీస్ అనే వ్యవ స్థను ఏర్పాటు చేసి సీటు ఇ వ్వవద్ద అనుకున్న విద్యా ర్థులను అప్లికేషన్ పత్రం కోసం కాలేజీ, కార్పొరేట్ ఆఫీస్ ల మధ్య తిప్పుతూ నిరు త్సాహపరుస్తున్నారు. చాలా కాలేజీలు అప్లికేషన్స్ అ మ్మకం, స్వీకరిచే రిజిష్టర్ల మధ్య తేడా చూపించడం లేదు. కాలేజీలో ఎన్ని ‘బి’ క్యాటగిరీ సీ ట్లుంటే అన్ని అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయని చెప్పడం, ప్ర తి రోజు ఎన్ని అప్లికేషన్స్ అమ్మారో అన్ని అడ్మిషన్లు జరి గాయని చెప్పే కాలేజీలు మరికొన్ని, మెరిట్ లిస్ట్‌లో పేరు న్న విద్యార్థి పేరు అప్లికేషన్ అమ్మకం రిజిష్టర్‌లో లేకపోవడం, అసలు రిజిష్టర్ పెట్టని కాలేజీలు కొన్ని అ యి తే, మేనేజ్‌మెంట్ సీట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రమే యం ఏమిటి అని మరికొందరి వాదన, విచిత్రంగగాజిఒ 74 పాటిస్తునామంటూనే ఆ జిఒకు వ్యతిరేకంగా ప్రవర్తి స్తున్నారు. గతంలో ‘బి’ క్యాటగిరీ అడ్మిషన్ ప్ర క్రి యను తనిఖీ చే య డానికి వెళ్లిన అధికారులనే కాలేజీ, కార్పొట్ ఆఫీ సుల మధ్య తిప్పారంటే సాధారణ ప్రజలు అప్లికేషన్ పొం దడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఒకే ప్రా ంగణంలో అనేక కాలేజీలుంటే అన్నింటికీ వేరు వేరు ప్రవేశమార్గాలుండాలన్న ఎఐసిటిపి నిబంధనకు వ్య తి రేకంగా ఒకే ప్రవేశ మార్గంతో కొనసాగుతున్న కళా శా లలు, ఒకే సంస్థ అనేక కాలేజీలు నడుపుతుంటే అన్ని కా లేజీలకు కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చి విద్యా ర్థులను అ యోమయానికి గురిచేస్తున్నారు. వీటిలో అన్నీ ఒకే సంవ త్సరం ఆరంభించనవికావు, ఒకే ఫీజు కలిగి ఉండవు. అప్లికేషన్ ఖరీదు వేరు వేరు, వాటిలో కొన్ని మైనా రిటీ, మరికొన్ని నాన్ మైనారిటీ, వేరు వేరు యూనివ ర్సిటీల అఫిలియేషన్ కలిగి ఉండటం మొదలైన తేడా లున్న ప్పటికీ ఇంజనీరింగ్ కళాశాలల అడ్మిషన్లకు సం బం ధిం చి రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. 1)క ళాశా లలకు ఆర్థికంగా నష్టం కలుగకుండడం 2) ప్రతిభ ఆ ధారంగా విద్యారరుకుసీట్లు దొరకడం. అనేక వందల మందికి విద్య, ఉపాధి కల్పిస్తున్న, భావిభారత పౌరులను రూపొ ందిస్తున్న కళాశాలలకు ఆర్థిక నష్టాలు జరగకు ండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, సమాజంపైన ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని రంగా లలో తెలంగాణ ప్రత్యేకత చూపించాలని కోరుకుంటూ పార్టీ విద్యారంగ నాయతను పరిరక్షించడానికి కృషి చే య డం అభినందనీయ. అర్హత లేని కళాశాలలకు యూని వర్సిటీ అఫిలియేషన్ నిరాకరించడం ఆ కళా శాలల పటిష్టతకు తీసుకున్న చర్యలా భావించాలి కాని ప్రతీకార చర్యకాదు. మానవ వనరుల అభివృద్ధికి, దేశానికి అవసరం అయిన సాంకేతిక నిపుణులను అందిం చడంలో ఇంజనీరింగ్ కళాశాల పాత్ర కీలకం.