Search
Sunday 23 September 2018
  • :
  • :

ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు!

Engineering-feesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో  వివిధ  కోర్సుల వార్షిక  ఫీజులు దాదాపు ఖరారయ్యాయి. తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) కోర్సుల వారిగా  ఫీజుల నిర్ణయ ప్రక్రియను పూర్తి  చేసింది. బి.టెక్, బి.ఫార్మసీ కోర్సులకు కళాశాలల స్థాయిని బట్టి  ఫీజులను కనిష్టంగా రూ.35 వేలు నుండి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు నిర్ణయించినట్లు సమాచారం.  ఫీజుల ప్రతిపాదనలపై కళాశాలల యాజమాన్యాలతో కమిటీ సంప్రదింపులు పూర్తయా ్యయి.  కోర్సుల వారిగా టిఎఎఫ్‌ఆర్‌సి నియమించిన అధికారుల ఉప కమిటీలు  బుధవారం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటాయని, అనంతరం సిఫార్సుల నివేదికను ప్రభు త్వానికి  సమర్పించనున్నట్లు టిఎఎఫ్‌ఆర్‌సి అధికారి  ఒకరు చెప్పారు. ప్రతి మూడేళ్లకు ఒక సారి ప్రైవేటు వృత్తివిద్యా కళాశాలలు అందిస్తున్న విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను టిఎఎఫ్‌ఆర్‌సి సమీక్షించి వాటి వార్షిక ఫీజులను నిర్ణయిస్తుంది. గత మూడేళ్ళ కింద నిర్ణయించిన ఫీజుల గడువు 2015-16 విద్యా సంవత్సరంతో ముగిసింది. ఈ నేపధ్యంలో 2016-17 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల పాటు అమలు చేయనున్న ఫీజులను నిర్ణయించేందుకు టిఎఎఫ్‌ఆర్‌సి ఇటీవల చర్యలు చేపట్టింది.  మరోవైపు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న ఐదారు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటివరకు ఎఎఫ్‌ఆర్‌సితో సంప్రదింపులకు రాలేదని సమాచారం. అత్యధిక  ఈ కళాశాలలు తమ ఫీజులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.  ఇప్పటికే ఎక్కువ ఫీజులున్న  కళాశాలలకు కమిటీ అధికారులు నామాత్రపు  పెంపుదలను ప్రతిపాదించారు.  ఇందుకు సంబంధిత కళాశాలలు అభ్యంతరం వక్తం చేశాయని సమాచారం.

Comments

comments