Home తాజా వార్తలు ఇంజినీరింగ్ పోస్టులకు వచ్చేవారమే నోటిఫికేషన్

ఇంజినీరింగ్ పోస్టులకు వచ్చేవారమే నోటిఫికేషన్

Telangana_Govt_Logo_manatelanganaమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి నోటిఫి కేషన్ వచ్చే వారం విడుదల కానుంది. మొదట ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(ఎఇఇ)ను భర్తీ చేయనున్నారు. 947 ఎఇఇ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమ వుతున్నారు. వచ్చే వారం చివరి కల్లా ఎట్టి పరిస్థితుల్లోనే నోటిఫికే షన్ ఇవ్వాలనే లక్షంతో టిఎస్‌పి ఎస్‌సి అధికారులు ముందుకుపో తున్నారు. తొలి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కనీసం మూడు వారాలకు పైగా పడుతుందని ముందుగా అంచనా వేసినా… రాత్రి పగలు పని చేస్తూ త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధ్దమవుతున్నారు. ఆగస్టు మొదటివారంలో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ చివరివారం, అక్టోబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. గణ తంత్ర దినోత్సవ కానుకగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడానికి సిద్దమవుతు న్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన జిఒలోని శాఖల ఉన్నతాధికారులకు తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేఖలు రాసిం ది. ఆయా శాఖల నుంచి త్వరగా ఇండెంట్‌తో పాటు రోస్టర్ పాయిం ట్, రిజర్వేషన్, విద్యార్హతలు, ఇతర వివరాలను పంపించాలని లేఖలో పేర్కొన్నారు. శాఖలు వివరాలు పం పిస్తే ఆ తరువాత జరగాల్సిన ప్రక్రియ మరికొంత ఉందనే ఉద్దేశంతో ఈ లేఖలు రాసినట్లుగా సమాచారం. ఈ శాఖల ముఖ్య అధికారులతో ఆగస్టు 1న సాయంత్రం 3 గంట లకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావే శానికి అన్ని వివరాలతో రావాలని స్పష్టం చేశారు. ఆ వివరాలు రాగానే అన్ని ఇంజినీర్ల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
సివిల్ ఇంజనీర్లకే అవకాశాలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగాల్లో సగం ఇంజనీర్లే కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన జీవోల్లో 4326 ఉ ద్యోగాలను టిఎస్‌పిఎస్‌సి భర్తీ చేయనుంది. ఇందులో ఈనెల 27న విడుదల చేసిన జీవో 108లో 3783 పోస్టులు టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీ చేయ నున్నారు. వీటిలో 1455 పోస్టులు ఇంజనీర్లవే. గతంలోనే గ్రామీణ నీటి సరఫరా పథకం లో భాగంగా 543 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలంటూ జీవో విడుదల చేసింది. వీటన్నంటితో 1998 ఇంజనీర్ పోస్టులు టిఎస్‌పిఎస్‌సి భర్తీ చేయనుంది. వీటిలోనూ అత్యధికం సివిల్ ఇంజనీర్లతో భర్తీ చేసేవే కావ డమ గమనార్హం. ఇలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తమ అర్హత అధారంగా లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో త మకు ఎన్ని పోస్టులకు అర్హత ఉందో నిరుద్యోగులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇంజనీర్లు కాకుండా మిగిలిన 2328 పోస్టుల్లో గ్రూప్ 1, 2, 3 పోస్టులుగా విభజించాల్సి ఉంది. దీంతో తక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటే మొదటి సారి పోటీ తీవ్రంగా ఉంటుందనే ఆందోళనతో ఉన్నారు. రెండువేల ఇంజనీర్ పో స్టులే ఉండటంతో నిరుద్యోగులు కొంత నిరాశ చేందుతున్నారు. ఇంజనీరింగ్ చదివిన వారిలోనూ కొంత నిరుత్సాహం కనపడుతుంది. ఉన్న పోస్టులన్ని సి విల్ ఇంజనీరింగ్ అర్హత ఉన్న వారికే కావడంతో మిగిలిన కోర్సులు చేసిన వా రిలో కొంత నిరుత్సాహం కనపడుతోంది. ప్రైవేటు రంగంలో ఎప్పుడు ఉద్యో గం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితిల్లో ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు. కష్టపడి చదువుదామనుకున్న అర్హత లేకపోవడంతో నిట్ట్టూరుస్తున్నారు.