Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Drown-Swimmingకీసర : మేడ్చల్ జిల్లా కీసర మండలం పెద్దమ్మ చెరువులోకి దూకి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కీసర మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మోర రవికాంత్ కొడుకు ఆదిత్య(22) ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం కాలేజీకి వెళ్లిన ఆదిత్య తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పెద్దమ్మచెరువులో శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని మేడ్చల్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆదిత్య అకాల మరణంతో అతని కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

comments