Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం

SUICIDE1రంగారెడ్డి: జిల్లాలోని కీసర మండల పరిధిలో గల హోలీమేరీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన గిరీష్(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఆత్మహత్యకు పాల్పడ్డ గిరిష్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా అని తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని స్థానిక సిఐ గురువారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments