Home తాజా వార్తలు ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

SUICIDE4కృష్ణా : నూజివీడు టిపుల్‌ఐటిలో ఓ విద్యార్థిని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం జగదీశ్వరపురం గ్రామానికి చెందిన వీణ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం ఆమె స్నేహితులు తరగతికి రావాలని పిలవగా, తన ఆరోగ్యం సరిగాలేదని, తర్వాత క్లాసుకు వస్తానని చెప్పింది. వాళ్లు మళ్లీ వచ్చి చూసే సరికి వీణ ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించింది. దీంతో వాళ్లు భయంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. అధికారులు వీణను చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.