Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సినిమా అవకాశాల కోసం వ్యభిచారం

prostitution

హైదరాబాద్ : వెండితెరపై వెలిగిపోవాలనే ఆశతో బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంది. సినిమాల్లో ఎలాగైనా రాణించాలనే కోరికను నిజం చేసుకోవాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. సినిమా అవకాశాల కోసం, అందుకు కావాల్సిన డబ్బు కోసం వ్యభిచార కూపంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్ నగర్‌లో నాగభాస్కర్ అలియాస్ విక్కి కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతున్నాడు. పి. సాయి దుర్గాప్రసాద్, పి.ధర్మ అనే వ్యక్తులు అతడికి అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందమైన అమ్మాయిలను కనిపెట్టి.. వారి బలహీనతల ఆధారంగా చేసుకొని వాళ్లను ఈ కూపంలోకి లాగడం వారి పని. ఈ నేపథ్యంలో బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండటంతో దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు ఇస్తామని వీరు అమెను ట్రాప్ చేశారు.
తొలుత సినిమా షూటింగ్ కోసమని పలు ఫోటోలు కూడా తీశారు. ఇక ఆ ఫోటోలను కొందరు యువకులకు పోస్ట్ చేసి సదరు అమ్మాయిని బేరం పెట్టారు. చాలా మంది అమెను కావాలని కోరుకోవడంతో ఆమెను వ్యభిచారంలోకి దింపారు. దీంతో రెండు రోజుల క్రితం ఎల్‌ఎన్ నగర్‌లోని వ్యభిచార గృహంలో పోలీసులకు చిక్కింది. అమెతో పాటు ముంబయికి చెందిన మరో మోడల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నింబోలి అడ్డాలోకి బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉన్నట్లు, కార్తీక్, ధర్మాలను ఐపిసి సెక్షన్ 370, 370ఎ, పిటా యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు.

Comments

comments