Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ @ 1000

eng
దుబాయి: ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ జట్టు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనుంది. భారత్‌తో బుధవారం ప్రారంభమయ్యే తొలి టెస్టు ఇంగ్లండ్ చరిత్రలో 1000వ టెస్టు మ్యాచ్ కానుంది. ప్రపంచంలో మరే జట్టు కూడా ఇన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. అంతేగాక 1000వ టెస్టును ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలువనుంది. ఇం గ్లండ్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను 1877లో ఆస్ట్రేలియాతో ఆ డింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లండ్ మొత్తం 999 టెస్టు మ్యాచ్‌లను ఆడింది. భారత్‌తో జరిగే మ్యాచ్‌తో ఇం గ్లండ్ టెస్టు చరిత్రలో వెయ్యి టెస్టుల మైలురాయిని అందుకుంటుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇన్ని టెస్టు మ్యా చ్‌లు ఆడలేదు. 812 టెస్టులతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. కాగా, ఇప్పటి వరకు 999 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ 375 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో 297 మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. కాగా, 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.
ఐసిసి అభినందనలు..
మరోవైపు 1000వ టెస్టు మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ జ ట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అభినందనలు తెలిపింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది అరుదైన ఘ ట్టంగా దీన్ని ఐసిసి అభివర్ణించింది. టెస్టు క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు హృదయ పూ ర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ఐసిసి తెలిపింది. ఈ మే రకు ఐసిసి అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఓ ప్రకటనను విడు దల చేస్తూ ఇంగ్లండ్ జట్టు సభ్యులను అభినందించారు. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, క్రికెట్ బోర్డుకు ఐసిసి తరపున అభినందనలు అందజేశారు. సుదీర్ఘ టెస్టు ప్రస్థానంలో ఇంగ్లండ్ ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్‌కు అందించిందని మనోహర్ ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఆటగాళ్లను ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌కు అందిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా, తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఐసిసి తరపున ఇంగ్లండ్ జట్టుకు ప్రత్యేక వెండి ఫలకంను అంద జేయనున్నట్టు మనోహర్ తెలిపారు.

Comments

comments