Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ @ 481

englad

 వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు

నాటింగ్‌హామ్: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న 444 అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లం డ్ తిరగరాసింది. ఆసీస్‌తో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్ (147), బెయిర్‌స్టో (139), జాసన్ రాయ్ (82), మోర్గాన్ (67) శివమెత్తారు. దీంతో ఇంగ్లండ్ చారిత్రక స్కోరును నమోదు చేసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హేల్స్ 92 బంతుల్లో 16 ఫోర్లు, మరో ఐదు సిక్సర్లతో 147 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన బెయిర్‌స్టో 92 బంతుల్లో ఐదు సిక్సర్లు, మరో 15 బౌండరీలతో 139 పరుగులు సాధించాడు. రాయ్ కూడా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82, మోర్గాన్ 30 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 67 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.

Comments

comments