Home తాజా వార్తలు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

james-anderson

న్యూఢిల్లీ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.ఆ జట్టు స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అండర్సన్‌కు 6 వారాల విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు నుంచి తప్పుకోనున్నాడు. 2016లో అండర్స్‌కు ఈ గాయం కాగా అప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. తాజాగా అండర్సన్‌కు 6 వారాల విశ్రాంతి కల్పించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతున్న వేళ అండర్సన్ జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది.