Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఇసిబిపై పీటర్సన్ ఫైర్..

  • స్టోక్స్, బట్లర్‌కు ఐపిఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలి

Pietersen-Stokesన్యూఢిల్లీ: మాజీ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీట ర్సన్ ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ముంబయి ఇండియన్స్ కీలకమైన ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్ల ర్‌లను తిరిగి ప్రతిష్టాతక్మమైన ఐపిఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ ల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని పీటర్సన్ ఇసిబిని డి మాండ్ చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం మేరకు స్టోక్స్, బట్లర్ ఇప్పటికే భారత్‌ను వదిలి వెళ్లిపో యారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఐపిఎల్‌లో ఆడేందు కు అనుమతి ఇవ్వాలని పీటర్సన్ ఇసిబిని కోరాడు. ఐపిఎల్ 10 సీజన్‌లో ముంబయి, పుణె జట్లు ఆటగాళ్లు స్టోక్స్, బట్లర్ అద్భుత ప్రదర్శనతో ఇరుజట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన సంగతి విదితమే. ఇప్పుడు వీరద్దరూ ఐపిఎల్‌కు దూరమవ్వడం ఇరుజట్లకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఇసిబి నుంచి పిలుపు మేరకు స్టోక్స్, బట్లర్ దక్షిణాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్, అనంత రం ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు వెళ్లాల్సివ చ్చింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి ముందుగా ఇంగ్లాండ్ జట్టు శిక్షణ నిమిత్తం స్పెయిన్‌కు పయనం కానుంది. ఈ నేపథ్యంలో పీటర్సన్ ట్విట్టర్ వేదిక ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐపిఎల్‌లో చివరిదైన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడకుండా బట్లర్, బెన్ స్టోక్స్ స్పెయిన్‌లో గడిపేందుకు వెళ్లడం చాలా దుర దృష్టకరమని అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఐపిఎల్ చివరి దశలో స్టోక్స్ లేకపోవడం పుణె జట్టుకు పెద్ద దెబ్బే తగిలింది. ఇంగ్లాండ్ ఆటగాడు స్టోక్స్ ఒక్కడే ఐపిఎల్ 10 సీజన్‌లో పుణె తరపున 300 పరుగులు సాధించి 10 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు ముంబ యి ఆటగాడు బట్లర్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 272 పరుగు లు సాధించి జట్టుకు తనవంతు సహకారాన్ని అందించా డు. బట్లర్ ఐపిఎల్‌కు దూరం కానుండటంతో అతడికి బదులుగా లెండల్ సిమన్స్ ముంబయి జట్టులోకి రానున్నాడు.

Comments

comments