Home స్కోర్ ఇంగ్లండ్ ఫ్యాన్స్ బరితెగింపు.. కోహ్లీపై…(వీడియో)

ఇంగ్లండ్ ఫ్యాన్స్ బరితెగింపు.. కోహ్లీపై…(వీడియో)

England Fans Mock Virat Kohli After India's Defeat to England

ఎడ్జ్‌బాస్టన్: ఇంగ్లండ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవమానించేందుకు యత్నించారు.తొలి టెస్టు ముగిసిన తర్వాత భారత జట్టు హోటల్‌కు వెళ్లేందుకు సిద్ధమవ్వడంతో బయట వారిని తీసుకెళ్లేందుకు బస్సు వచ్చింది. అయితే, అప్పటికే బస్సు వద్దకు చేరుకున్న ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయారు. అత్యుత్సాహంతో బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘‘మాకు అండర్సన్ ఉన్నాడు. మీ కోహ్లీ ఎక్కడ?’’, ‘‘ఇప్పుడు కోహ్లీ మోహం ఎలా ఉందో చూడాలని ఉంది’’ అంటూ కేకలు వేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని అడ్డు తప్పించారు. ఇంగ్లండ్ ఫ్యాన్స్ ప్రదర్శించిన ఈ అత్యుత్సాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ టెస్టులో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో అత్యంత కఠిన పరిస్థితుల్లో 149 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పోరాట పటిమతో 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేశాడు. అయినా మిగతా బ్యాట్స్ మెన్లు విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.