Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ ఘన విజయం

England had great victory in the first Test against Sri Lanka

గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 462 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య శ్రీలంక జట్టు 250 పరుగులకే కుప్పకూలింది. 15/0 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన లంక ప్రారంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు కరుణరత్నె, కుశాల్ సిల్వా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడిని విడగొట్టేందుకు ఇంగ్లం డ్ బౌలర్లు ప్రారంభంలో బాగానే కష్ట పడాల్సి వచ్చింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి కుదురుకుంటున్నట్టు కనిపించింది. అయితే సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్న కుశాల్ (30)ను జాక్ లీచ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ కరుణరత్నె (26) కూడా ఔటయ్యాడు. అతన్ని మోయి న్ పెవిలియన్‌బాట పట్టించాడు. తర్వాత లంక మళ్లీ కోలుకోలేక పోయింది. ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను ఇబ్బందుల్లోకి నెట్టారు. ధనంజయ డిసిల్వా (21) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయా డు. అతన్ని స్టోక్స్ ఔట్ చేశాడు. ఈ దశలో కుశాల్ మెండిస్, సీనియర్ ఆటగాడు ఎంజెలో మాథ్యూస్ ఇంగ్లండ్ బౌలర్ల జోరును కొద్ది సేపు అడ్డుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని నిలువరించారు. కానీ, ఇది ఎక్కువ సేపు సాగలేదు. 77 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు చేసిన మెండిస్‌ను లీచ్ వెనక్కి పంపాడు. దీంతో లంక కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ పో యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూస్ ఐదు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. కెప్టెన్ చండీమల్ (1) ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్ కీపర్ డిక్వెల్లా (16) కూడా నిరాశే మిగిల్చాడు. దిల్రువన్ పెరీరా మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు. దీంతో లంక స్కోరు 250కి చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ నాలుగు, లీచ్ మూడు వికెట్లు పడగొట్టారు.

England had great victory in the first Test against Sri Lanka

Telangana Latest News

Comments

comments