Search
Sunday 18 November 2018
  • :
  • :

రెండో వన్డే: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

England have won the toss and have opted to bat

లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మొదట టాస్ గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు మొదటి వన్డేలో ఆడిన ఆటగాళ్లతోనే ఈ వన్డేలో కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో తొలి వన్డేలో విజయం సాధించి టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని కోహ్లీ సేన బరిలోకి దిగుతుండగా, సొంత గడ్డపై సిరీస్ పరాభవం నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ అనుకుంటుంది. ఇక మొదటి వన్డేలో ఆతిథ్య జట్టును ఘోరంగా దెబ్బ కొట్టిన భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ నుంచి మరోసారి ఇంగ్లండ్ ప్రమాదం లేకపోలేదని క్రీడ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments