Home తాజా వార్తలు భారత్ 36/2…రాహుల్ డకౌట్

భారత్ 36/2…రాహుల్ డకౌట్

Rahul-and-vijay1

విశాఖపట్నం: వై ఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో గురువారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. మురళీ విజయ్ 20 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ పరుగులు ఏమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బ్రాడ్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో పూజారా(8), విరాట్ కోహ్లి (8)లు ఉన్నారు.