Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పట్టుబిగించిన ఇంగ్లాండ్

england

మెరిసిన డెవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టోవ్
యాషెస్ మూడో టెస్ట్

పెర్త్: ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో గురువారం జరిగిన యాషెస్ మూడో టెస్ట్‌లో డావిడ్ మలన్, జానీ బెయిర్‌స్టోవ్ బాగా రా ణించారు. గురువారం ఆట ముగిసే సమయానికి ఇం గ్లాండ్ క్రికెటర్ డావిడ్ మలన్ శతకం, జానీ బెయిర్‌స్టోవ్ అర్ధ శతకం, మార్క్ స్టోన్‌మాన్ అర్ధ శతకంతో ఇంగ్లాండ్ జ ట్టు 4 వికెట్ల నష్టానికి 305 స్కోరుకు చేరింది. డావిడ్, జా నీ ఇంకా అజేయంగా క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటికే బ్రిస్బేన్‌లో, అడిలైడ్‌లో గెలిచి 20 ఆధిక్యంతో ఉంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టును గెలవడం లేదా కనీసం డ్రా అయినా చేయాలని ఇంగ్లాండ్ జట్టు కోరుకుంటోంది. ఎందుకంటే ఓడితే యాషెస్‌ను ఆస్ట్రేలియా జట్టుకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. స్టోన్‌మాన్(56)వద్ద ఔట్ అయినప్పుడు ఇంగ్లాండు 4 వికెట్ల నష్టానికి 131 స్కో రు వద్ద నిలిచింది. కానీ ఆట ముగిసే సమాయానికి 15 నిమిషాల ముందు మలాన్(అజేయంగా 110) తన తొలి శతకాన్ని సాధించాడు. అతడికి తోడుగా ఉన్న జానీ బెయిర్‌స్టోవ్ అజేయంగా 75 పరుగులు చేశా డు. వారిద్దరూ తమ భాగస్వామ్యంలో 174 పరుగులు జోడించారు. శుక్రవారం ఇంగ్లాండ్ జట్టు తన అనుకూలత దృష్టా ఇంకా మెరు గ్గా ఆడొచ్చని అనిపిస్తోంది. కెప్టెన్ జో రూట్ టాస్ గెలి చి ఆటను ఆరంభించాడు. మొదట్లోనే స్టోన్‌మాన్ బౌలర్ మిచెల్ స్టార్క్ బం తులకు మూడు ఫోర్లు బా దాడు. మూడో ఓవర్లో 79వ సోరు వద్ద 2వ వికెట్‌గా ఔటయ్యా డు. జేమ్స్ విన్సే(25) మొదట్లో బాగానే స్కోరు చేశాడు. కానీ జోష్ హాజెల్‌వుడ్ బంతికి క్యాచ్ ఔటయ్యాడు. రూట్ 20 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బంతికి టిమ్ పెయినే చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు.
స్కోరు బోర్డు
ఇంగ్లాండ్: అలస్టెయిర్ కుక్(ఎల్‌బిడబ్లు)(బి) మిచెల్ స్టార్క్ 7, మార్క్ స్టోన్‌మాన్(సి)టిమ్ పెయినే(బి) మిచెల్ స్టార్క్ 56, జేమ్స్ విన్సే(సి)టిమ్ పెయినే(బి)జోష్ హాజెల్‌వుడ్ 25, జోరూట్(సి)టిమ్ పెయినే(బి) పాట్ కమ్మిన్స్ 20, డావిడ్ మలన్(బ్యాటింగ్) 110, జానీ బెయిర్‌స్టోవ్(బ్యాటింగ్) 75. ఎక్స్‌ట్రాలు: 12 వికెట్ల పతనం: 126, 289, 3115, 4131, బౌలింగ్: మిచెల్ స్టార్క్ 193792, జోష్ హాజెల్‌వుడ్ 207621, పాట్ కమ్మిన్స్ 216601, నాథన్ లియోన్ 194610, మిచెల్ మార్ష్ 71250, స్టీవెన్ స్మిత్ 3180.

Comments

comments