Search
Wednesday 21 November 2018
  • :
  • :

ముగిసిన నాలుగో రోజు ఆట: ఇంగ్లాండ్ 182/6

India Vs Englandముంబయి: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 631 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 235, మురళీ విజయ్ 136, జయంత్ యాదవ్ 104 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో దోహద పడ్డారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆది నుంచే బ్యాటింగ్‌లో తడబడింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరిగా పెవిలియన్ బాటపట్టారు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో రూట్ 77, బైస్టో 50 మినహా మిగితా వారందరూ స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. భారత బౌలింగ్‌లో అశ్విన్, జడేజా 2 వికెట్లు, యాదవ్, కుమార్ చెరో వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 400

భారత్ తొలి ఇన్నింగ్స్: 631

Comments

comments