Search
Sunday 18 November 2018
  • :
  • :

రాణించిన కోహ్లీ… ఇంగ్లాండ్ లక్ష్యం 257

vrtలీడ్స్‌: మూడు వన్డేల సిరీస్ లో భాగాంగా నిర్ణయాత్మక చివరి వన్డేలో భారత్ ఆతిథ్య ఇంగ్లాండ్‌కు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా ట్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ(2) మరోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్(44) తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ(71) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  ఈ ధశలో ధావన్ రన్ఔట్  కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.అనంతరం నాలుగో స్థానంలో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (21) కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 156 పరుగుల వద్ద విరాట్ కూడా ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ (42),  హార్థిక్ పాండ్యా(21)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (22), భువనేశ్వర్ కుమార్(21) రాణించడంతో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో  డేవిడ్‌ విలె, ఆదిల్‌ రషీద్‌  చెరో 3 వికెట్లు తీశారు.

Comments

comments