Home స్కోర్ ఇంగ్లాండ్ జట్టు వెనక్కి?

ఇంగ్లాండ్ జట్టు వెనక్కి?

ఒప్పందం కుదరకుండానే భారత్ చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు
బిసిసిఐ-లోధా కమిటీ ప్రతిష్టంభన పరిణామం
ఇంకా పెండింగ్‌లోనే ఉన్న పేపర్ వర్క్

ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడే టెస్టులకు సౌరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ముంబయి, తమిళనాడు సంఘాలు ఆతిథ్యమిస్తున్నాయి. బిసిసిఐ నుంచి అందిన డబ్బులను ఖర్చుపెట్టరాదని లోధా కమిటీ ఆ రాష్ట్ర క్రికెట్ సంఘాలను ఆదేశించడంతో మ్యాచ్‌ల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఆ రాష్ట్ర సంఘాలకు భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్‌లకు అయ్యే నిర్వహణ ఖర్చులను భరించే శక్తి ఉందో లేదో తెలపాలని లేఖ రాసింది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాయో లేవో చెప్పాలని కోరింది. ముందు జాగ్రత్త చర్యగానే బిసిసిఐ ఇలా చేసిందని  బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 

cricketన్యూఢిల్లీ: ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు ఇంకా వారం రోజులైనా లేవు. ఇంగ్లాండు జట్టు పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) మధ్య ఇంత వరకు అవగాహన పత్రం (ఎంఒయు)పై సంతకాలు జరగనే లేదు. ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించిన ఇలాంటి ప్రామాణిక పత్రంపై సంతకాలు కాకపోవడానికి బిసిసిఐ- లోధా కమిటీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండు జట్టు పర్యటన, మ్యాచ్‌లు సజా వుగా జరుగుతాయా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినా భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లు నిరాటంకంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల అమలు, లోధా కమిటీ సిఫారసుల అమ లు, బిసిసిఐ అంగీకారాల రీత్యా కొంత మేరకు అనుమా నాలు పీడిస్తున్నాయి. కాగా అవగాహన పత్రంపై కొన్ని స్పష్టీకరణలను బిసిసిఐ, లోధా కమిటీని కోరింది. దీనికి ప్రతిస్పందించిన లోధా కమిటీ చెల్లింపులు క్రికెట్ విధా నాల ఏర్పాటులో భాగం కాదని తెలిపింది. అయితే బోర్డు మరింత వివరాలు ఇచ్చాకే బిసిసిఐ చెల్లింపులకు సంబంధించిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. వివిధ కాంట్రాక్టులకుల వివరాలను బోర్డు ఐదు రోజుల్లోగా సవివరంగా తెలిపితేనే వచ్చే ఏడాది ఎలాంటి అవంతరాలు లేకుండా సజావుగా సాగేందుకు కమిటీ నిర్ణయాలను ఖరారు చేయనుందని తెలిపింది. లోధా కమిటీ బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కేకు గురువారం పంపిన ఇమెయిల్‌లో సుప్రీంకోర్టు జులై 18, అక్టోబర్ 7, 21న జారీ చేసిన మూడు ఉత్తర్వులను ఆమోదించాలని పేర్కొంది. క్రికెటింగ్ క్యాలెండర్ షెడ్యూల్‌లో ఎలాంటి అవాంతరాలు పొడసూపకుండా ఉండేందుకు అవసరమని కూడా తెలిపింది.
లోధా కమిటీ సిఫారసులను పూర్తిగా అంగీకరించ నంత వరకు ఆయా రాష్ట్ర అసోసియేషన్లకు ఎలాంటి నిధులు కేటాయించరాదని బిసిసిఐని సుప్రీంకోర్టు అక్టోబర్ 21న ఆదేశించింది. లోధా కమిటీ సిఫారసుల ను జులై 18న సుప్రీంకోర్టు ఆమోదించింది. నవంబర్ 3కల్లా లోధా కమిటీని కలవాల్సిందిగా షిర్కే, ఠాకుర్‌ల ను కోర్టు ఆదేశించింది. ఏవేని కాంట్రాక్టులు చేసుకునే విషయంలో అనేక ఆంక్షలను బిసిసిఐపై విధించింది. లోధా కమిటీ ఈ వారం ఠాకుర్‌కు, గురువారం షిర్కేకు ఇమెయిల్స్ పంపింది. కాంట్రాక్టులు, చెల్లింపులు వంటి విషయాలకు సంబంధించిన విధివిధానాలను స్పష్టీకరిం చడం లాంఛనప్రాయం కాదని, అవగాహన లేకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలుపరచడం, బిసిసిఐకు ఆదేశాలు జారీచేయడం వంటికి కమిటీకి కష్టసాధ్యమని పేర్కొంది. ఇదిలా ఉండగా షిర్కే లోధా కమిటీకి అక్టోబ ర్ 28న ఓ ఇమెయిల్ చేశారు. అందులో ‘ప్రాధాన్యత ఆధారంగా’ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎందు కంటే లోధా కమిటీ అంగీకారం లేకుండా క్రికెట్ వ్యవహారాలు నడపడం ‘తీవ్ర కోర్టు ధిక్కారణ’ కింద వస్తుందన్నారు. కమిటీ ముఖ్య కాంట్రాక్టుల విషయం లో ఏమీ తేల్చకపోవడం వల్ల అనేకం ఇంకా పెండింగ్ లో ఉండిపోయాయని పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న కాంట్రాక్టుల్లో ఐపిఎల్ టెండర్ వాయిదా, ఐపిఎల్, అంతర్జాతీయ, స్థానిక క్రికెట్ విక్రేతల(వెండార్స్) ఖరా రు, టీమిండియా స్పాన్సర్‌షిప్‌ల షర్టులు, టైటిల్స్ వాయిదా పడ్డాయని ఉదాహరించారు. ‘పరిమిత విలు వ’పై కూడా స్పష్టత కావాలని షిర్కే కోరారు. కాంట్రా క్టుల పరిమితి ఎంతకు మించరాదో స్పష్టం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బిసిసిఐ లావాదేవీలపై స్వతంత్ర ఆడిటర్‌ను ఏర్పాటు లోధా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
బిసిసిఐ ఆదాయం, ఆర్థిక వ్యవహారా కస్టోడియన్ గానే లోధా కమిటీని కోర్టు నియమించినందున వెంటనే కార్యాచరణను చేపట్టాలని షిర్కే అన్నారు. అనిశ్చితి కారణంగా ఐపిఎల్ టెలివిజన్, డిజిటల్ హక్కులలో ఇప్పటికే విలువ తగ్గిపోయిందని బోర్డు భావిస్తోందని షిర్కే పేర్కొన్నారు. విక్రేతలను ఖరారు చేయడమన్నది తన పని కాదని లోధా కమిటీ గురువారం బిసిసిఐకు స్పష్టం చేసింది. కాంట్రాక్టులు, విక్రేతల గుర్తింపు, నియామకం అనేవి తన పనికాదని తేల్చి చెప్పింది. కాంట్రాక్టుల విలువ పరిమితిని నిర్ణయించడం, పరిమితి దాటిన కాంట్రాక్టులకే ఆమోదం తెలుపడం కమిటీ పని అని తెలిపింది. కాంట్రాక్టుల పరిమితి తేల్చేందుకు, ఆడిటర్‌ను నియమించేందుకుగాను కాంట్రాక్టు విలువ, కాలపరి మితి, గడువు వంటి కాంట్రాక్టుల వివరాలను ఇవ్వా ల్సిందిగా బిసిసిఐని లోధా కమిటీ ఆదేశించింది. కాగా భారత్‌లో ఇంగ్లాండ్ జట్టు పర్యటన ఖర్చు వివరాలను ఇసిబికి బిసిసిఐ తెలుపాల్సిం ఉందని కూడా షిర్కే, లోధా కమిటీకి మరో ఇమెయిల్‌లో తెలిపారు. ఏ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకువాలో, నిబంధనలు, షరతులు ఏమిటో స్పష్టం చేయాల్సిందిగా షిర్కే, లోధా కమిటీని కోరారు. ఇంగ్లాండులో ఆడే టెస్టులను నిర్వహించడానికి తగినంత నిధులు ఉన్నాయో లేవో తెలుపాల్సిందిగా ఆ టెస్టులు జరిగే ఐదు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు షిర్కే లేఖలు కూడా రాశారు.
అవగాహన పత్రం రూపొందించడమన్నది కోర్టు ఉత్తర్వులో భాగం కానిదని లోధా కమిటీ స్పష్టం చేసింది. బిసిసిఐ, ఇసిబి ప్రతిపాదిత అవగాహన పత్రం, ద్వైపాక్షిక క్రికెట్ విధానం, విధివిధానాలు కమిటీ పరిధిలోనివి కావనీ, ఇక చెల్లింపుల విషయానికొస్తే బిసిసిఐ నేరుగా వాటిని చెల్లించాల్సి ఉంటే పూర్తి వివరాలను బిసిసిఐ ఇవ్వనంత వరకు వాటిపై కమిటీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోదని కూడా తెలిపింది.