Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ ఉత్కంఠ గెలుపు

england

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. చివరి ఓవర్‌ను క్రిస్ పొదుపుగా వేయడంతో ఇంగ్లాండ్ అద్భుత గెలుపును దక్కించుకుంది. కివీస్ కెప్టెన్ కానె విలియమ్సన్ అజేయ శతకం సాధించినా జట్టును గెలిపించలేక పోయాడు. చివరి ఓవర్లో విజయం కోసం 15 పరుగులు అవసరం కాగా కివీస్ పది పరుగులు మాత్రమే చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 235 పరుగుల స్కోరును కాపాడుకొని విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆతిథ్య కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 143 బంతుల్లో ఆరు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ కొలిన్ మున్రో (49), సాంట్నర్ (41) తప్ప మిగతావారు విఫలం కావడంతో న్యూజిలాండ్‌కు ఓటమి తప్పలేదు. మోయిన్ అలీ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఇంగ్లాండ్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. బ్యాటింగ్‌లో 23 పరుగులు చేసిన మోయిన్ బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. అతనికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదిల్ రషీద్, వోక్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. కాగా, ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను కెప్టెన్ మోర్గాన్ (48), బెన్ స్టోక్స్ (39) ఆదుకున్నారు.

Comments

comments