Home స్కోర్ భారత్ పర్యటించే ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

భారత్ పర్యటించే ఇంగ్లాండ్ జట్టు ఎంపిక

తొలి టెస్ట్‌కు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ దూరం
cricketలండన్: త్వరలో భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లా ండ్ జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) ప్రకటించింది.అల్‌స్టైర్ కుక్ కెప్టె న్సీలో 16మంది సభ్యులు గల జట్టును ఇసిబి వెల్ల డించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించ నుం ది. 16 మంది సభ్యుల జట్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పేరును చేర్చలేదు. అయి తే ఇంగ్లాండ్ కోచ్ బేలిస్ మాత్రం ఆండర్సన్ ఆడే విష యంలో ఆశాభావం వ్యక్తం చేశారు. అతడికి వైద్య సిబ్బంది అనేక స్కాన్లు నిర్వహించిందని, అత డు ఆరోగ్యంగానే కనిపిస్తు న్నాడని, అయి నప్పటికీ వైద్య సిబ్బంది ఇంత వరకు ఎలాంటి సానుకూల సూచన చేయలేదని, అందుచేత అతడు మొదటి టెస్ట్‌కు మాత్రం కచ్చితంగా దూరం కానున్నాడని తెలిపారు. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండు జటునే ఏమార్పులు లేకుండానే భారత్ పర్యటనకు యథాతథంగా ఎంపికచేశారు. ప్రారంభ టెస్టుకు ఆండర్సన్ దూరం కానున్నాడని కెప్టెన్ కుక్ ఇదివరకే వెల్లడించారు. కనుక అతడు రాజ్‌కోట్ లో ఆడ నున్న ప్రారంభ టెస్ట్‌లో ఆడబోవడం లేదు. భారత్ పర్యటించే ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు సీమర్లు(పేసర్లు) స్టీవెన్ ఫిన్, జేక్ బాల్, ఓ స్పిన్నర్ జాఫర్ అన్సారీ ఉన్నా రు. ఇంగ్లాండ్ జట్టు ఆరుగురు దూకుడు బ్యాట్స్‌మెన్లు, ముగ్గురు పేసర్లు, ముగ్గు రు స్పిన్నర్లపై నమ్మకం పెట్లుకునుంది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టులోకి ఇంకొందరిని తీసుకోదలిస్తే మాత్రం ఆ జట్టులో 18 మంది సభ్యుల వరకు ఉండనున్నారని సమాచారం. ఫాస్ట్ బౌలర్ మార్క్ ఉడ్ ఇప్పటికీ చీలమండ ఆప రేషన్ అవసర మైనందున అతడు ఇంగ్లాండ్ జట్టుకు అందుబాటులో ఉండబోవడం లేదు. అయి తే బంగ్లాదేశ్ పర్యటిస్తున్న జట్టులో అతడున్నాడు.
ఇంగ్లాండ్ జట్టు: అలస్టైర్ కుక్(కెప్టెన్), మోయీన్ అలీ, జాఫర్ అన్సారీ, జానీ బైర్‌స్టో, జేక్ బాల్, గారి బ్యాలెన్స్, గ్యారెత్ బాటీ, స్టువర్ట్ బ్రాడ్, జాస్ బట్లర్, బెన్ డ్యూకెట్, స్టీవెన్ ఫిన్, హసీబ్ హమీద్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోగ్స్.