Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రాహుల్ అరుదైన ఘనత

Rahul

లండన్: ఇంగ్లాండ్- భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో టిమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పాడు. ఒక సిరీస్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన మూడో అటగాడిగా ఘనత సాధించాడు. నాలుగో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో రెండు క్యాచ్ లు పట్టాడు. అలిస్టర్ కుక్, మొయిన్ అలీ క్యాచ్ లను అందుకున్నాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో రాహుల్ ద్రవిడ్ 13 క్యాచ్ లు పట్టి తొలి స్థానంలో ఉండగా  సోల్కర్ 12 క్యాచ్ లతో రెండో స్థానం, కెఎల్ రాహుల్ 11 క్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు.

 

Comments

comments