Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

లార్డ్స్ టెస్టు: ఇంగ్లండ్ 396 డిక్లేర్డ్

England vs India, 2nd Test in Lord's

లార్డ్స్: వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో కేవలం 107 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రూట్ సేనకు ఏకంగా 289 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. నాల్గో రోజు 359/6తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయి 396 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 289 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు క్రిస్ వోక్స్ (137) అజేయ శతకం చేయగా, జానీ బెయిర్‌స్టో 93 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ, హర్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు.. ఇషాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. 289 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ సేన మరోసారి తడబడింది. 13 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. మురళి విజయ్(0) రెండో ఇన్నింగ్స్ లోనూ డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రాహుల్(10) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రహానె(1), పుజారా(5) ఉండగా, భారత్ స్కోర్: 17/2.

Comments

comments