Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్‌దే రెండో టి-20

England

కార్డిఫ్: భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 11తో సమం చేసింది. ముం దుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47 పరుగులు చేశాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోని ఐదు ఫోర్లతో వేగంగా 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఓపె నర్లు రోహిత్ శర్మ (5), శిఖర్ ధావన్ (10), లోకేష్ రాహుల్‌లు విఫ లమయ్యారు. దీంతో భారత్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పో యింది. ఈ దశలో సురేశ్ రైనాతో కలిసి కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి నాలుగో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. తర్వాత సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను అలెక్స్ హెల్స్ ఆదుకున్నాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న హెల్స్ 41 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జాని బైర్‌స్టో రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌ను సమం చేసింది.
నేడు చివరి పోరు…

Australian series schedule finalized

ఇరు జట్ల మధ్య ఆదివారం చివరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఆఖరి టి20పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. బ్రిస్టొల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లు కూడా సమతూకంగా ఉండడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. తొలి టి20లో భారత్ సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో లోకేష్ రాహుల్ ఇరగ దీశాడు. అజేయ శతకంతో భారత్‌కు ఘన విజయం సాధించి పెట్టాడు. అయి తే రెండో టి20లో రాహుల్ విఫలమయ్యాడు. ఇది భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు కూడా ఇప్ప టి వరకు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచలేదు. కనీసం ఈసారైన వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. వీరిద్దరూ శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉండదు. కెప్టెన్ కోహ్లి కూడా మెరుగైన బ్యాటింగ్ కనబరచక తప్పదు. రైనా, ధోని, పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ బలంగానే ఉంది. భువనేశ్వర్, ఉమేశ్, కుల్దీప్, చాహల్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు విజయవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే రెండో టి20లో భారత్‌ను ఓడించిన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయలేం. రెండో టి20లో ఇంగ్లండ్ బౌలర్లు మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. ప్లంకెట్, విలే, ఆదిల్ రషీద్ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. బ్యాటింగ్‌లో హెల్స్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను బరిలోకి దించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదే జరిగితే ఇంగ్లండ్‌కు కూడా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.

Comments

comments