Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రెండో వన్డేలో ఆసీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు

ingland

కార్డిఫ్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఇంగ్లాండ్ గెలిచింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 38 పరుగుల తేడాతో గెలుపొంది ఆసీస్‌కు మరో షాకిచ్చింది. ఫలితంగా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 343 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమం లో ఆసీస్ 47.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటయింది. షాన్ మార్ష్(131; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆస్టన్ అగర్(46; 42 బంతుల్లో 7 ఫో ర్లు)లు రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ప్లంకెట్ నాలుగు వికెట్ల తీసుకుని సత్తా చాటగా, ఆదిల్ రషీద్ మూడు వికెట్ల తీశాడు. ఇక మొయిన్ అలీ రెండు వికె ట్లు సాధించగా, మార్క్ వుడ్ వికెట్ తీశా డు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇం గ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 342 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్(120; 108 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, బట్లర్( 91 నాటౌట్;70 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. వీరికి జతగా బెయిర్ స్టో(42; 24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడటంతో ఇం గ్లాండ్ భారీ స్కోరు నమోదు చేసింది.

Comments

comments