Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్ మహిళల గెలుపు

englandకాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వికెట్ కీపర్ సారా టేలర్ 4 ఫోర్లతో 30, కటెరినా బ్రంట్ రెండు ఫోర్లు, మరో సిక్సర్లతో 24 బంతుల్లోనే అజేయంగా 32 పరుగులు చేసింది. మరోవైపు నటాలి సివర్ 3 ఫోర్లతో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షూట్, జెసె జొనాసెన్ పొదుపుగా బౌలింగ్ చేశారు. తర్వాత సునాయాస బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ బౌలర్లు హడలెత్తించారు. స్టార్ బౌలర్ జెన్ని గున్ అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయింది. గున్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. బ్రంట్, సోఫిలకు రెండేసి వికెట్లు లభించాయి. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 112 పరుగులకే కుప్పకూలింది.

Comments

comments