Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లండ్ మహిళల రికార్డు

england

టాంటన్: మహిళల ట్వంటీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు టోర్నీలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ట్వంటీ20ల్లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అంతకు కొన్ని గంటల ముందే న్యూజిలాండ్ సాధించిన 216 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ తిరగరాసింది. ఇటీవలే పురుషుల వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ 481 పరుగుల రికార్డు స్కోరును సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మహిళా జట్టు కూడా ట్వంటీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకుని సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు సాధించింది. ఓపెనర్లు వ్యాట్, బీమౌంట్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 147 పరుగులు జోడించారు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన బీమౌండ్ 52 బంతుల్లోనే 18 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 166 పరుగులు సాధించింది. టి20ల్లో బీమౌంట్‌కు ఇదే మొదటి శతకం. మరోవైపు వ్యాట్ 36 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేసింది. చివర్లో బ్రంట్ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, మరో 3 సిక్సర్లతో అజేయంగా 42 పరుగులు చేసింది. స్కివర్ కూడా ధాటిగా ఆడింది. 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరచడంతో ఇంగ్లండ్ 250 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బేట్స్ అజేయ శతకం.. కివీస్ జయభేరి..
అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి మహిళల టి20లలో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా చరిత్ర సృస్టించింది. కివీస్ ఓపెనర్ సుజి బేట్స్ 66 బంతుల్లోనే 16 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో అజేయంగా 124 పరుగులు చేసింది. మరో ఓపెనర్ సోఫి డివైన్ 4ఫోర్లు, 4 సిక్సర్లతో 48 బంతుల్లోనే 73 పరుగులు సాధించింది. దీంతో కివీస్ 216 పరుగుల ప్రపంచ రికార్డును నెలకొల్పింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసి 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా, కివీస్ సాధించిన 216 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరును తర్వాతి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ బద్దలు కొట్టడం విశేషం.

Comments

comments