Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పాకిస్థాన్ పై ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విక్టరీ

england

లీడ్స్: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్  జట్టు ఇన్నింగ్స్  55 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం  బ్యాటింగ్ కు దిగి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసి పాకిస్థాన్‌పై 189 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. అయితే ఈ ఆధిక్యాన్ని దాటడంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన జాస్ బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రెండు మ్యాచుల్లో 10 వికెట్లు తీసిన మహ్మద్ అబ్బాస్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డులు లభించాయి.

Comments

comments