Home తాజా వార్తలు ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ నటి సుజాతా కుమార్ ఇకలేరు

‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ నటి సుజాతా కుమార్ ఇకలేరు

'English Vinglish' actress Sujata Kumar passed away

ముంబయి: బాలీవుడ్‌ నటి సుజాతా కుమార్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సుజాత ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఆమె సోదరి సుచిత్ర కృష్ణమూర్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా సోదరి సుజాత కుమార్‌ ఇకలేరు. ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు. జీవితమెప్పుడూ ఇక ఒకేలా ఉండదు’ అని చెప్పారు. విల్లే పార్లేలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అలనాటి నటి శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంలో సుజాత శ్రీదేవికి సోదరి పాత్రలో నటించారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన లెజండ్ మూవీలో నటించింది. అలాగే గోరి తేరే ప్యార్ మేన్, రంజ్‌హనా సినిమాలతో పాటు పలు టీవీ షోలలో నటించారు. ‘హోటల్‌ కింగ్‌డమ్‌’, ‘బాంబే టాకింగ్‌’, ‘24’ అనే ధారావాహికల్లోనూ సుజాత నటించారు.