Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పక్కా వివరాలతో 15లోగా  కొత్త పహాణీలు

వెయ్యి మంది గ్రామీణ సిబ్బందికి చేతి నిండా పని
రైతులకు నష్టం లేకుండా పంటల నివేదికలు
జెసి వెంకటరామిరెడ్డి

Untitled-2సంగారెడ్డి: తప్పులను సరిచేసి, పూర్తి వివరాలను సేకరించి వచ్చేనెల 15లోపు కొత్త పహాణీలను తయారు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని జెసి పి.వెంకటరామిరెడ్డి జిల్లా తహసీల్దార్‌లను కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పహాణీలలో గల లోపాలు, కొత్త ఖాతాల నమోదు, పహాణీ తయారు చేసే విధానంలో ఎదురయ్యే సమస్యలు, ఏవిధంగా తయారుచేస్తే పహాణీ పూర్తిస్థాయిలో తప్పులు లేకుండా అందుబాటులోకి వస్తుందో అనే అంశాల పై చర్చ జరిపారు. తహసీల్దార్ల సూచనలను పరిగణలోకి తీసుకుని వచ్చేనెల 15లోపు కొత్త పహాణీలను పూర్తిచేద్దామని నిర్ణయించారు. తహసీల్దా ర్లు ఈ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తిచేసేందుకు క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమా న్ని పూర్తి నాణ్యతతో పూర్తిచేయించడం తన ధృడ సంకల్పమన్నారు.
ఈ నెల 26న సిధ్దిపేట, 28న సంగారెడ్డి, 29న జహీరాబాద్, 30న జహీరా బాద్ లోక్ సభ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 700 మంది విఆర్‌వో లు, 300 మంది విఆర్‌ఎల సేవలను వినియో గించుకుంటామన్నారు. ఎక్కు వ శాతం రైతులు పహాణీలు తప్పులను సరిచేయిం చుకునేందుకు తిరుగుతు న్నారని, వా రందరికీ ఈ కార్యక్రమం శాశ్వత పరి ష్కారం చూపడమే కాకుం డా నూతనంగా ఉద్యోగాలలో చేరిన విఆర్‌ఎలకు మంచి అనుభవాన్ని స్తుందన్నారు. రాతపూర్వక పహాణీలను తయారుచేసి విధిగా గ్రామ సభలలో చదివి విన్పించాలని సూచించా రు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను తప్పక భాగస్వామ్యం చేయాలని తహసీ ల్దార్లను ఆయన కోరారు. కేంద్ర బృందా లు జిల్లా పరిశీలనకు వచ్చినప్పుడు స్వ తంత్ర నివేదికలు పంపడం వలన రైతుల కు నష్టం జరుగుతున్నందున రైతులకు న్యాయం జరిగేందుకు వీలుగా ఇకనుంచి క్రాప్ కటింగ్ ఎక్స్‌పర్ మెంట్స్‌ను తహసీ ల్దార్లు స్వయంగా చూసిన తరువాత మా త్రమే ఛీప్ ప్లానింగ్ అధికారికి పంపా లన్నారు. ఈ ప్రక్రియ ద్వార గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన వివ రాలు బయటపడ తాయన్నారు. రైతుల పేర్లు, సర్వే నెంబర్లు, ఖరీఫ్‌లో వేసిన పం టల వివరా లను పరిశీలన జరిపి నమోదు చేస్తే పంటల సాగు, నీటి వనరుల వివరా లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందు బాటులో ఉంటాయన్నారు. అవసరాల కు అనుగుణంగా ప్రభుత్వం తగిన ప్రణా ళికలు రూపొందించుకో వచ్చన్నారు.

Comments

comments