Search
Saturday 22 September 2018
  • :
  • :

విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై విచారణ..

ఉపాధ్యాయుడు కొట్టాడని విచారణలో చెప్పిన పాఠశాల  విద్యార్థులు..
కలెక్టర్ ఆదేశానుసారం త్రిసభ్య కమిటీ ఏర్పాటు.. డిఆర్‌ఒ చంద్రయ్య,  డిఇఒ సుశీందర్‌రావు,  డిఎంహెచ్‌ఒ డా.శ్రీనివాసులు విచారణ ..

                      Student-and-teacher

శ్రీరంగాపురం:ఆత్మహత్య సంఘటనపై కలె క్టర్ శ్వేతామహంతి ఆదేశానుసారం శుక్రవారం శేరుపల్లి గ్రా మంలో గురువారం యుగంధర్ అనే ఉపాధ్యాయుడు కొట్టాడ ని ఆనంద్(11) అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఆనంద్ తీవ్రంగా గాయ పడి మహబూబ్‌నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న ఆత్మహత్య సంఘటనపై  కలెక్టర్ శ్వేతామహంతి ఆదే శానుసారం త్రిసభ్య కమిటీ శేరుపల్లి గ్రామంలో జరిగిన సం ఘటన గురించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుల అభిప్రా యాలు మరియు విద్యార్థుల అభిప్రాయాలు,బాధిత కుటుం బానికి చుట్టు ప్రక్కల వారిని, గ్రామస్తులను త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టారు.

పూర్తి స్థాయిలో  విచారణ చేపట్టి సమగ్ర నివేదికను కలెక్టర్ శ్వేతా మహంతికి అందజేస్తామని డిఆర్వో విలేకరులతో మాట్లాడారు . విచారణలో విద్యార్థులు శేరుపల్లి ప్రా థమిక పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు యుగం ధర్ ఆనంద్ అనే విద్యార్థిని కొట్టినట్లు విచారణ కమి టికి విద్యార్థులు తెలియజేశారు. సమగ్ర విచారణ చేపట్టి త్వరలో నివేదికను కలెక్టర్ శ్వేతామహంతికి సమర్పిస్తామని విచారణ కమిటి సభ్యులు డిఆర్‌ఒ చంద్రయ్య, డిఇఒ సుశీందర్‌రావు, డిఎంహెచ్‌ఒ డా.శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ అన్నా రు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ భాస్కర్, ఆర్‌ఐ కృ ష్ణమూర్తి, తహశీల్దార్ శ్రీనివాస్‌రావు ఎంఇఒ జయ రాములు, పాన్‌గల్ ఎంఇఒ లక్ష్మణ్‌నాయక్, డిఆర్ ఒ చంద్రయ్య, డిఇఒ సుశీందర్‌రావు, డిఎం హెచ్‌ఒ డా.శ్రీనివాసులు విచారణలో పాల్గొన్నారు.

Comments

comments