Home వార్తలు భయపడాల్సినదేమీలేదు

భయపడాల్సినదేమీలేదు

ATM-Cardsడెబిట్ కార్డుల భద్రతపై ప్రభుత్వం భరోసా!

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న భారత్‌లో 32 లక్షల డెబిట్ కార్డుల భద్రత ప్రమాణాలకు ముప్పు వాటిన నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు శుక్రవారం చేపట్టింది. భయపడాల్సిన దేమీ లేదని, తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం బ్యాంకింగ్ కస్టమర్లకు భరోసా ఇచ్చింది. ఇదిలా ఉoడగా ఈ విషయంపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ), ఇతర ప్రధాన బ్యాంకులను ఆదేశించారు. దొంగిలించిన డెబిట్ కార్డుల సమాచారంతో దేశవ్యాప్తం గా 19 బ్యాంకులలోని 641 మంది కస్టమర్లను రూ. 1.3 కోట్ల మేరకు మోసగించడం జరిగిందని నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. మోసపూరిత డెబిట్ కార్డుల విత్‌డ్రాలు 19 బ్యాంకుల నుంచి జరిగి నట్లు ఇంత వరకు అందిన సమాచారం వల్ల తెలుస్తోంది. విదేశాలలో ముఖ్యంగా చైనా, అమెరికాలో ఈ విత్‌డ్రాలు జరిగాయని ఫిర్యాదులందాయి. కస్టమర్లు భారత్‌లోనే ఉన్పప్పటికీ విదేశాల్లో విత్‌డ్రాలు జరిగిపోయాయని సమాచారం. డెబిట్ కార్డుల సమాచార ఉల్లంఘనపై, సైబర్ నేరాలను ఎదుర్కొనే సంసిద్ధతపై వివరాలు అందించా ల్సిందిగా ప్రభుత్వం దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ), ఇతర బ్యాంకులను ఆదేశించింది.

జరుగుతున్న నష్టాన్ని నివారించడానికే నివేదికను కోరడం జరిగిందని జైట్లీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా అన్ని అంశాలపై నివేదిక కోరినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. నివేదిక అందాక అసలేమి జరిగిందో ప్రభుత్వానికి తెలుస్తుందని ఆయన అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ భద్రత చాలా ముఖ్యమని, నాలుగు నెలల కిందటే ఆర్‌బిఐ బోర్డ్ సమావేశంలో సైబర్ సుక్యూరిటీపై సవివ రంగా చర్చించామని, భద్రతకు ఫైర్‌వాల్స్‌ను మరింత పటిష్టపరచమని సూచించామని కూడా చెప్పారు. భయప డాల్సింది ఏమీ లేదని, బ్యాంకుల ఐటి సిస్టం పటిష్టంగానే ఉందని, కావలసిన మేరకు ప్రభుత్వం తగు చర్య తీసు కుంటుందని ఆయన విలేకరులతో అన్నారు. ప్రభుత్వం విషయాన్ని తన అధీనంలోకి తీసుకుందని, అసలేమి జరిగిందో నివేదికలు పంపాల్సిందిగా ఆర్‌బిఐ, ఇతర బ్యాంకులకు ఆదేశించడం జరిగిందని వివరించారు. ప్రాథమిక విధానపర నివేదిక అందిందని, మరిన్ని వివరాలతో తుది నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూ స్తోందని, ఆ నివేదిక అందగానే తీసుకోవలసిన చర్యను ప్రభుత్వం చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి ముందు ఓ జర్మన్ ఈవెంట్ సందర్భంలో శక్తికాంత దాస్ విలేకరులతో మాట్లాడుతూ ఈ హ్యాకింగ్‌తో బ్యాంకింగ్ కస్టమర్లు కలవరపడాల్సిన పనిలేదని, కంప్యూటర్ల ద్వారా జరిగే ఇలాంటి హ్యాకింగ్ జాడలను సునాయాసం గా గుర్తిస్తామని, ఆ తర్వాత తీసుకోవలసిన చర్యలు తీసుకుంటామని, అతి కూడా అతి వేగవంతంగా జరుపుతామని అన్నారు.

ప్రభావితమైన డెబిట్ కార్డులలో వీసా, మాస్టర్ కార్డు లు 26.5 లక్షలని, కాగా రూపే కార్డులు 6,00,000 లు అని, డెబిట్ కార్డుల భద్రత ప్రమాణాల ఉల్లంఘన 90 ఎటిఎంలలో జరిగిందని సమాచారం. కాగా తమ నెట్‌వర్క్‌లలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన జరగలేదని వీసా, మాస్టర్ కార్డులు ప్రత్యేక ప్రకటనలో తెలిపాయి. హితాచీ అనుబంధ హితాచీ పేమెంట్ సర్వీసెస్ కొన్ని ఎటిఎంల నెట్‌వర్క్‌ల ప్రక్రియలను నిర్వహిస్తోంది. అయితే మాల్‌వేర్ సమస్యతోపాటు ఎలాంటి పొరపాటు జరిగిందన్న దానిపై అదిప్పుడు దర్యాప్తును చేపట్టింది. నివేదిక అందాక ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి మండలి(ఎఫ్‌ఎస్‌డిసి) సమావేశంలో సైబర్ సెక్యూరిటీపై సమగ్రంగా చర్చిస్తామని, అన్ని బ్యాంకులకు, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థలకు తగు ఆదేశాలు జారీ చేస్తామని శక్తికాంత దాస్ చెప్పారు. భారత్‌లో దాదాపు 60 కోట్ల డెబిట్ కార్డులు చెలామ ణిలో ఉన్నాయి. వాటిలో 19 కోట్ల డెబిట్ కార్డులు స్వదేశి పరిజ్ఞానంతో రూపే రూపొందించినవే. మిగతావి వీసా, మాస్టర్‌కార్డ్‌కు చెందిన డెబిట్ కార్డులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) దాదాపు 6 లక్షల కార్డులను వెనక్కి తెప్పించుకోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు అనేక మంది కస్టమర్లకు ముందస్తు జాగ్రత్త చర్యగా డెబిట్ కార్డుల రిప్లేస్‌మెంట్ చేశాయి. రెండు వారాలలో దాదాపు 6 లక్షల డెబిట్ కార్డులను రిప్లేస్ చేయనున్నామని ఎస్‌బిఐ బెంగాల్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పార్థ ప్రతిం సేన్‌గుప్తా గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంకులు తమ కస్టమర్లను పిన్ నంబర్ మార్చుకోమని కోరాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇంకా తన కస్టమర్లను తన ఎటిఎంలలోనే లావాదేవీలు నిర్వహించాల్సిందిగా సూచించింది. డెబిట్ కార్డుల భద్రత ఉల్లంఘన హితాచీ పేమెంట్ సర్వీసెస్ సిస్టంలలో దూరిన మాల్‌వేర్ కారణంగానే జరిగిందని సమాచారం. అది యెస్ బ్యాంక్, కొన్ని వైట్-లేబుల్ ఎటిఎంలలో తన నెట్‌వర్క్‌లను కలిగి ఉ ంది. పండుగ సీజన్‌లో ఈ డెబిట్ కార్డు సమస్య తలెత్తడంతో దాదాపు రూ. 1,000కోట్ల మేరకు బ్యాంకు రిటైల్ క్రెడిట్ లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఎస్‌బిఐ బ్యాంకు ‘హోప్ లోన్స్’ పథకానికి కూడా దెబ్బతగిలింది.