Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

HEC

హైదరాబాద్ : కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం ఖరారు చేసింది. మే 2నుంచి 5 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తారు. మే 9న ఈసెట్, మే17న ఐసెట్, మే 20న పిఈసెట్, మే25న లాసెట్, మే 26న పిజి లాసెట్ పరీక్షలను నిర్వహిసాకతరు. ఈ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఈసెట్ నిర్వహణ బాధ్యతను జెఎన్‌టియుహెచ్‌కు అప్పగించినట్టు అధికారులు తెలిపారు. లాసెట్, పిజి లాసెట్, ఎడ్‌సెట్, పిజి ఈసెట్ నిర్వహణ బాధ్యతలను ఓయూకు అప్పగించారు. ఐసెట్ నిర్వహణ బాధ్యత కేయూకు, పిజిసెట్ నిర్వహణ బాధ్యతను మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులకు అప్పగించారు.

Entrance Exam dates are finalized in Telangana

Comments

comments