Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఉచిత విద్య ప్రవేశ పరీక్షకు నేడు తుది గడువు

Half Day Schools in Telangana from March 15

కంఠేశ్వర్: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా ధృక్పథంతో ప్రగతినగర్, హైదరాబాద్ నందు పీపుల్స్ ప్రొగ్రెసిస్ ట్రస్టు ద్వారా నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ప్రగతి విద్యానికేతన్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాల నుంచి ఈ సంవత్సరం 350 మంది నిరుపేద విద్యార్థు లను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ, 6వ, 7వ, 8వ తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి, వారు చదువుకున్నంత వరకు ఉచిత విద్యను అందించబడుతుందని చెప్పారు.

ప్రవేశ పరీక్ష ఈ నెల 14న ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. ప్రవేశ పరీక్ష నమోదుకు ఈ నెల 10న చివరి తేది కావడంతో నమోదు చేసుకునే వారు జిల్లా కేంద్రంలో సుభాష్‌నగర్‌లో గల ఇందూర్ హైస్కూల్ యందు సంప్రదించాలన్నారు. ప్రవేశ పరీక్షలో తెలుగు 20, ఇంగ్లీషు 20, గణితం 30, సామాన్యశాస్త్రం 20, జనరల్ నాలేడ్జ్ 10 మార్కులకు ప్రశ్నలు వస్తాయన్నారు. వివరాలకు 9912973173 (సత్యనంద్), 9440933704 (రమేష్)ను సంప్రదించగలరన్నారు.

Comments

comments