Home జోగులాంబ గద్వాల్ గురుకుల పాఠశాలలో చేరుటకు ప్రవేశ పరీక్ష

గురుకుల పాఠశాలలో చేరుటకు ప్రవేశ పరీక్ష

sit2
మనతెలంగాణ/గద్వాల అర్బన్: 2018-19 విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థిని, విద్యార్థులు గురుకుల పాఠశా లలో 5వ తరగతి చేరుటకు గాను ఏప్రిల్ 8న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ శుక్రవారం ప్రకటనలో తెలి పారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ మునకు 1.తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యూ కేషనల్ ఇన్సిటి ట్యుడ్, 2.తెలంగాణ ట్రైబల్ వేల్బేర్ , 3.వెనుకబడిన సంక్షేమ రెసిడెన్సి యల్ తో పాటు,4. తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యు కేషనల్ ఇన్సిటి ట్యూడ్ సోసైటీలు కలిసి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ ద్వారా విద్యార్థులను చ చేర్చుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు గాను విద్యార్థులు http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్ కు వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఈనెల 16 వ తేదిగా నిర్ణయించారన్నారు. ఇప్పటికే ఈ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమైయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. 4వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని గురుకుల పాఠశాల లో చేరేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యం గా గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.