Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాల్లో ఈక్విటీ మార్కెట్లు

Sensexన్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు గురువారం ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. మొత్తానికి గత వారం నష్టాల నుంచి కోలుకున్న సూచీలు ఈవారం వరుస లాభాలను నమోదు చేస్తున్నాయి. తాజాగా బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి షేర్ల పతనం వల జోరు తగ్గి సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ముందుకు కదల్లేకపోయాయి. అయితే బైబ్యాక్ ప్రతిపాదన చేయడంతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు మార్కెట్‌లో రాకెట్‌లా దూసుకెళ్లి 4 శాతానికి పైగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, చివర్లో అమ్మకాల ఒత్తిడి వంటివి సూచీలను ముందుకు కదలకుండా చేశాయి. అయితే నిఫ్టీ కీలకమైన 9,900 పాయింట్లపైన ముగియగలిగింది. ఆఖరికి సెన్సెక్స్ 25 పాయింట్ల లాభంతో 31,795 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఒక దశలో 167 పాయింట్లు లాభపడగా, మరో దశలో 57 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 9,904 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తత తగ్గుముఖం పట్టటంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండడం సానుకూల ప్రభా వం చూపించాయి. దీంతో ఉదయం సమయంలో మార్కెట్ లాభాల్లో ట్రేడ్‌అయింది. అయితే యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆర్‌బిఐ మోనెటరీ పాలసీ కమిటీ ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి షేర్లు 1 శాతం నుంచి 4.5 శాతం స్థాయి మేరకు లాభపడ్డాయి. ప్రధానంగా లాభపడిన షేర్లలలో ఇన్ఫోసిస్ (+4. 54 శాతం), కోల్ ఇండియా (+4.22 శాతం), ఎన్‌టిపిసి (+3.97 శాతం), భారతీ ఎయిర్‌టెల్ (+2.29 శాతం), హెచ్‌డిఎఫ్‌సి (+0.95 శాతం) ఉన్నాయి. మరోవైపు సిప్లా (-2.85 శాతం), అదానీ పోర్ట్ (-1.81 శాతం), మారుతీ (-1.23 శాతం), కోటక్ బ్యాంక్ (-1.17 శాతం), హెచ్‌యుఎల్ (-1.04 శాతం) నష్టపోయాయి.

Comments

comments