Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు

ఇది రాజకీయ శక్తుల ఏకీకరణే : సిఎం కెసిఆర్
కాళేశ్వరం పూర్తి చేసి రెండు పంటలకు నీళ్లు ఇస్తామని హామీ
వరంగల్ జిల్లాకు ఏటా రూ. 300 కోట్ల నిధులు
errabelliమన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి శాసనసభా పక్షనేత, పాలకుర్తి ఎంఎల్ ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్ లో టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు లాంఛ నంగా గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌లో చేరికలు తెలంగాణ రాజకీయ శక్తుల ఏకీ కరణ కోసమే తప్ప చిల్లర రాజకీయాల కోసం కాదన్నారు. టిఆర్‌ఎస్‌లో ఇక పైనా ఎవరు చేరినా అది తెలంగాణ రాజకీయ శక్తుల ఏకీకరణగానే చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి, బస్వరాజు సారయ్య లాంటి వారు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లోకి వచ్చారన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పార్టీలో చేరిన వారందరికీ, మరీ ముఖ్యంగా భారీగా తరలివచ్చిన ఎర్రబెల్లి అనుచరులకు అభినందనలు తెలియజేస్తున్నానని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
సమైక్య పాలనలో గోదావరి నీరంతా వృథాగా సముద్రంలో కలిసిందని, తాము కాళేశ్వరం ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేసి ఏటా రెండు పంటలకు నీరిస్తామ న్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల తరహాలో వ్యవసాయ పరం గా రైతులకు మేలు చేస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా అత్యం త అభివృద్ధి చెందిన జిల్లా అని, దశల వారీగా అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్య, వైద్యం ఇతర అన్ని వసతులున్న జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. బడ్జెట్‌లోనూ ఎటా వరంగల్ జిల్లా అభివృద్ధికి రూ. 300 కోట్ల వరకు నిధులు కేటాయిస్తామన్నారు.
చంద్రబాబు చేతులెత్తేశారు.. అందుకే టిఆర్‌ఎస్‌లోకి: ఎర్రబెల్లి
రాష్ట్ర విభజన నేపథ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రాకే పరిమితమై పోయారని, తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై చేతులెత్తేశారని అందుకే తాను టిఆర్‌ఎస్‌లో చేరానన్నారు. రాజకీయ స్వార్థంతో తాను పార్టీలోకి రాలేదని, అన్ని నియోజకవర్గాల మాదిరే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అభి వృద్ధి ఫలాలు అందించేందుకు టిఆర్‌ఎస్‌లో చేరినట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తన చేరికపై ఆ పార్టీ నేతలు ఎవరేమన్నా తాను పట్టించుకోనని ఎర్ర బెల్లి వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లితో పాటు పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు టిఆర్ ఎస్‌లో చేరారు.

Comments

comments