Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వ్యవసాయాన్ని పండుగా మార్చిన కెసిఆర్:ఎర్రబెల్లి దయాకర్‌రావు

Errabelli dayakar rao speaking about Rythu bandhu checks

చెక్కల పంపిణీ పారదర్శకంగా జరగాలి
అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తప్పవు
పాలకుర్తి ఎంఎల్‌ఏ ఎర్రబెల్లి దయాకర్‌రావు
మన తెలంగాణ/పాలకుర్తి : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ రైతులకు ముందస్తుగా పెట్టుబడులు అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నాడని పాలకుర్తి ఎంఎల్‌ఏ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో బృందావన్ గార్డెన్‌లో పట్టదార్ పాసుపుస్తకం రైతుబందు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రైతు సమన్వయ సమితి కన్వీనర్లు రైతులకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా జిల్లా కలెక్టర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి, ఎంఎల్‌ఏ ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సహకార సంస్థ యచైర్మన్ దరావత్ మోహన్ గాంధీ నాయక్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ రైతుబందు పథకం చారిత్రాత్మకను, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నాడని రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి సంవత్సరం ఒక ఎకరాకు రూపాయలు 8 వేలు పెట్టుబడులకు అందిస్తున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. పంచరాయి భూములకు కూడ పాసుబుక్కులు, చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలలో చెక్కుల పంపీణీలో పారదర్శకంగా జరుగాలన్నారు. గ్రామాలలో ఇటీవల జరిగిన భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల నుండి డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడిన అధికారులను వదిలేదిలేదని అన్నారు.

కొంతమంది వీఆర్‌వోలు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేశారని వారిపై చర్యలు తప్పవన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో రైతులకు ఎలాంటి సహాయాలు అందించలేదని కేసీఆర్ వచ్చిన తరువాతనే రైతుల కండ్లలో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. ప్రతిరోజు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి 300 చెక్కులను పంపిణీ చేస్తారని చెక్కుల పంపిణీలో అవకతవకలు జరుగకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు రైతు సమన్వయ సమితి కన్వీనర్‌లు పూర్తి భాద్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, జిల్లా వ్యవసాయాధికారి వీరూనాయక్, ఏడీఏ రాధిక, ఎంపీపీలు దల్జిత్‌కౌర్, సోమనర్సమ్మ, జడ్సీటీసీ లలిత, వైస్ ఎంపీపీ దామోదర్, రైతు సమితి మండల కన్వీనర్ యాకాంతారావు, గంగు క్రిష్ణమూర్తి, బాలునాయక్, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీలు, మండల వ్యవసాయాధికారి రమాదేవి, మూడు మండలాల వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments