Home రాష్ట్ర వార్తలు ఎర్రవల్లి.. వేదవల్లి

ఎర్రవల్లి.. వేదవల్లి

cm-kcrఅయుత చండీయాగం మహారంభం
హైదరాబాద్ / సంగారెడ్డి : లోక కళ్యాణార్దం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు న్న అయుత చండీయాగం బుధవారం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సిఎం వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన యాగశాలకు వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు బుధవారం ఉదయం 8.30 గంటలకు కెసిఆర్ దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా రుత్విక్కు లు, బ్రాహ్మణులు, నిర్వాహకులు ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రు లు ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు, కె.తారక రామా రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, సిఎం వెంట యాగశాలకు తరలివచ్చా రు. అనంతరం సిఎం రుత్విక్కులతో కలసి యాగ శాల ప్రదక్షిణ చేశారు. గవర్నర్ దంపతులు 8.45 గంటలకు యాగశాలకు రాగా, వారికి ముఖ్య మంత్రి దంపతులు, రుత్విక్కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చండీమాత విగ్రహం ఎదుట తొలి రోజు కార్యక్రమం ఆరంభమైంది. సిఎం ఈ సందర్భంగా దేవికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. అనంతరం గవర్నర్ దంపతులతో కలిసి గణపతి మహా పూజ, మహా సంకల్పం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గోపూజ, మహా మంటప స్థాపన, చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ట, నవావరణార్చన, ఏకాదశ న్యాసపూర్వక సహస్ర చండీ పారా యణం, పంచబలి, యోగినీ బలి, మహారుద్ర యాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పునశ్చరణా చతుర్వేద యాగ ప్రారంభం, మహా సౌరము, ఉక్త దేవతా జపములు, వెయ్యి చండీ పారాయణాలు, 40 లక్షల నవార్ణ మంత్ర జపాలు నిర్వహించి రాత్రి మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు.
ప్రముఖుల రాక
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి దిలీప్ బాబా సాహెబ్ బోస్లే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ఈనా డు సంస్థల అధినేత రామోజీరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కెటిఆర్, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ లకా్ష్మ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపిలు కేశవరావు, కవిత, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయా కర్, ఎంఎల్‌సిలు నారదాసు లక్ష్మణ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు బాబూమోహన్, గణేష్‌గుప్తా, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, రవీంద ర్‌రెడ్డి, ప్రశాంతరెడ్డి, బాలరాజు, శ్రీనివాసగౌడ్, ప్రభుత్వ సలహాదారు డిఎస్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఐజి నవీన్ చంద్ వచ్చారు.