Search
Monday 23 July 2018
  • :
  • :

క్రికెటర్‌తో ఈషా ప్రేమాయణం

Esha-Gupta

బాలీవుడ్‌లో మరో ప్రేమ చిగురించింది. హాట్ భామ ఈషా గుప్తా, క్రికెటర్ హార్దిక్ పాండ్యలు గాఢమైన ప్రేమలో ఉన్నట్టు తెలిసింది.  సినిమా తారలు, క్రికెటర్ల మధ్య ప్రేమలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈషా, హార్దిక్‌ల లవ్ ఎఫైర్ బయటకు వచ్చింది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ హార్దిక్ ఇంగ్లాండ్ పర్యనటలో బిజీగా ఉండగా… ఈషా గుప్తా ‘పల్టన్’ అనే సినిమాతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రేమాయణం బయటపడింది. వీరిద్దరూ సీక్రెట్‌గా కలిసి తిరిగిన పలు ఫొటోలు లీకయ్యాయి. ఇద్దరూ కలిసి డేటింగ్‌లో ఉన్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసిపోయింది.

Comments

comments