Home తాజా వార్తలు భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు: కెసిఆర్

భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు: కెసిఆర్

CM-KCR

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులందరికీ ఇఎస్‌ఐ వర్తించే విధానం రూపొందించాలని కెసిఆర్ తెలిపారు. కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష జరిపారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా అమలు చేయాలన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, బీమా కోసం చర్యలు చేపట్టాలని అధికారులకు  తెలిపారు. కార్మికుల కోసం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇఎస్‌ఐ సదుపాయం కల్పించాలని సూచించారు. కార్మికులందరి ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలన్నారు. మే 1 తరువాత కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.