Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇఎస్‌ఐ కొత్త నిబంధనలు.. రోగులకు ఇబ్బందులు

esi-image

ఇఎస్‌ఐ ఆసుపత్రిలో…నూతన విధానంతో రోగుల అష్టకష్టాలు
ఆసుపత్రిలోకి మహిళల నిరాకరణ
సహాయకులు లేకపోవడంతో రోగుల పడరానిపాట్లు
మహిళల రక్షణకే ఈ నిబంధన :ఇన్‌చార్జి డిఎంఎస్

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐ) ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అర్థం, పర్థం లేని నిబంధనలను అమలు చేస్తూ రోగులకు, వారి సహాయకులకు చుక్కలు చూపుతున్నారు. మహానగరంలో ఏ ఆసుపత్రిలో లేని ఈ విచిత్ర విధానాన్ని సనత్‌నగర్ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో అమలు చేస్తుండటంతో రోగుల కుటుంబసభ్యులు
ఆందోళన చెందుతున్నారు.

మహిళ సహాయకులకు అనుమతి నిరాకరణ….
బతుకు దెరువు కోసం వచ్చిన కుటుంబాలే ఇక్కడ ఎక్కువ. వీరంతా దాదాపు చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు. దీంతో వీరు ఏ రోగం వచ్చిన ఇఎస్‌ఐనే ఆశ్రయిస్తుంటారు. ఈ నగరంలో పక్కింటివారినే పట్టించుకోని పరిస్థితి ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాంటిది భర్త, కుమారుడు ఎవరైన రోగాన పడి ఇఎస్‌ఐలో చేరితే సేవ చేసేందుకు(అటెండెంట్)గా సనత్‌నగర్‌లోని ఇఎస్‌ఐ ఆసుపత్రిలో మహిళలలకు అనుమతి నిరాకరించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఆసుపత్రి వర్గాలు తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా భార్య, భర్త లేక, కుమారుడు, తల్లి మాత్ర మే ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురుషులకు సహాయకురాలిగా మహిళలు ఉంటే వారిని కేవలం సా యంత్రం 4 గంటల 6 గంటల వరకు విజిటింగ్ సమయంలో మా త్రమే అనుమతిస్తుండటంతో మిగతా సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చికిత్స పొందుతున్న రోగులు వాపోతున్నారు. రాత్రుళ్లు, పగళ్లు సహాయకురాలిగా వచ్చిన మహిళలు బ యటే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

అన్నం కూడా సమయానికి తినడం లేదు : కిష్టయ్య (మెదక్‌జిల్లా వాసి)…. నేను ఇక్కడ వారం రోజుల క్రితం అడ్మిట్ అయ్యాను. వా ర్డులోకి మా భార్యను అనుమతించడం లేదు. నేను ప్రస్తుతం నడవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మా కుమారుడు ఉద యం సాయంత్రం సమయంలో ఉంటారు, మిగతా సమయంలో ఉద్యోగం నిమిత్తం వెళతారు. మధ్యాహ్నం తినాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ ఆసుపత్రిలో పెట్టిన నిబంధనలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఈ నిబంధనలు ఎత్తివేయాలని కోరుతున్నాను.

నిబంధనలు ఎక్కడా లేవు : నర్సిములు (రోగి సహాయకుడు)
సనత్‌నగర్ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో నిబంధనలు ఇతర ఏ ఆసుపత్రిలో కూడా లేవు. ఈ నిబంధనలతో తమ ఉద్యోగాలు వదులుకొని ఆసుపత్రిలో రోగికి సహాయకుడిగా ఉండాల్సి వస్తోంది. తాము ఉద్యోగాలు చేస్తేనే ఈ ఇఎస్‌ఐ కార్డు ఉంది, అదే ఉద్యోగానికి వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. చికిత్స పొందుతున్న రోగులకు అన్నం తినిపించడానికి కూడా మహిళా సహాయకులను వదలకపోవడం చాలా బాధను కలిగిస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నాను.

రోగులకు ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు : ఇన్చార్జీ డిఎంఎస్
మహిళలలకు రక్షణ చర్యల్లో భాగంగానే పురుషుల వార్డులోకి మహిళలను అనుమతించడం లేదని ఇన్చార్జీ డిఎంఎస్ డాక్టర్ శైలజ తెలిపారు. ఈ అంశంపై ఆమె స్పందిస్తూ పురుషుల వార్డుల్లో ఎక్కువ భాగం సహాకులుగా పురుషులే ఉండటం, ఒకరు ఇద్దరు మహిళలు ఉండటం వల్ల వారిని ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారనో ఈ నిబంధనలు అమలు చేస్తున్నాం, తప్ప రోగులను కానీ వారి సహాయకులకు ఇబ్బందులు పెట్టే ఉద్దేశం లేదన్నారు.

Comments

comments