Home తాజా వార్తలు ఇఎస్‌పిఎన్ ప్రపంచ టాప్ 100 ఆటగాళ్లలో కోహ్లి, ధోనీ

ఇఎస్‌పిఎన్ ప్రపంచ టాప్ 100 ఆటగాళ్లలో కోహ్లి, ధోనీ

Dhoni-and-Kohliలండన్: భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, టెస్ట్ జట్టు సారథి విరాట్ కోహ్లిలకు అరుదైన గౌరవం దక్కింది. ఇఎస్‌పిఎన్ విడుదల చేసిన ప్రపంచ టాప్ 100 స్పోర్ట్‌పర్సన్స్ జాబితాలో విరాట్‌కు 8వ స్థానం, ధోనీకి 14వ స్థానం దక్కించుకున్నారు. పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. కాగా, మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 41వ స్థానం లభించింది. అయితే టాప్ 100లో కేవలం 8 మంది మహిళలకే స్థానం దక్కడం గమనార్హం. ఇఎస్‌పిఎన్ టాప్ 20 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది…
క్రిస్టియానో రొనాల్డో, లెబ్రాస్ జేమ్స్, లియోనెల్ మెస్సీ, నెయిమార్, ఫెదరర్, కెవిన్ డ్యురాంట్, టైగర్‌వుడ్స్, విరాట్ కోహ్లి, జేమ్స్ రోడ్రిగెజ్, రఫెల్ నాదల్, కోబ్ బ్రయాంట్, గరేత్ బేల్, ఫిల్ మికెల్‌సన్, మహేంద్రసింగ్ ధోనీ, ఉసేన్ బోల్ట్, నొవాక్ జొకోవిచ్, వేన్ రూనీ, మారియా షరపోవా, మీసుట్ ఓజిల్, రోరి మెకల్‌రాయ్.