Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మానేరు అభివృద్ధి కార్పొరేషన్

ph

 మానేరు డ్యాం ప్రాంతం  సుందరీకరణకు రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ సంస్థ ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్: కరీంనగర్‌లోని మానేరు డ్యాం ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డిసిఎల్)ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి అరవిందకుమార్ శనివారం జారీచేశారు. మానేరు డ్యాం ప్రాం తం సుందరీకరణకు దీనిని ఏర్పాటుచేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరీంగనర్‌లోని లోయర్ మానేరు ప్రాజెక్టు చుట్టూరా, ముందు, వెనుక ప్రాంతాల్లో దాదాపు 100హెక్టార్ల భూమిలో వివిధ అభివృద్ధి పనులు ఎంఆర్‌డిసిఎల్ చేపడుతుంది. ఏడాది పొడవునా డ్యాంలో నీళ్లు ఉండేలా చర్యలు చేపడుతుంది. పార్కులు, పబ్లిక్ ప్రొమెనేడ్లు, వాకర్స్, సైకిల్ ట్రాక్స్, నదీ పక్కన నాలుగులేన్ల రోడ్డు, నివాస, వాణిజ్య కార్యకలాపాలు, క్రీడాసౌకర్యాలు, వినోద కార్యకలాపాలు వంటివి ఏర్పాటుచేస్తుంది. ఎంఆర్‌డిసిఎల్ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి,ఎండిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్, టూరిజం ఎండి, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ఇంజనీర్‌ఇన్‌చీఫ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వ్యవహరిస్తారు.

Comments

comments