Home తాజా వార్తలు గుడ్డు ధరపై ఈటెల సంచలన వ్యాఖ్యలు

గుడ్డు ధరపై ఈటెల సంచలన వ్యాఖ్యలు

 Minister Eetela Rajender

హైదరాబాద్: ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే గుడ్డు ధర అంతగా పెరగలేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా -2017 ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. గుడ్డు ధరపై ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. చాయ్, గుట్కా, సిగరేట్ ధరలు రూ.10 పైనే ఉన్నప్పుడు ప్రోటిన్ ఫుడ్ గుడ్డు ధర పెరిగితే ఏంటని ప్రశ్నించారు. సాధకభాదకాలు ఫౌల్ట్రీ రైతులకు తెలుసునన్నారు. గత ప్రభుత్వాలు పౌల్ట్రీని నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. 2016-17లో గుడ్డు ధర సగటున రూ.3.43 పైసలు ఉంటే, 2017-18 రూ.3.23 పైసలు ఉందని వెల్లడించారు. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే గుడ్డు ధర పెరిగిందన్నారు. మూడు రోజుల పాటు పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ జరగనుంది.