Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్

Untitled-4

కొండలమీంచి గలగలా పారుతున్న నీటి సవ్వడి ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడ కాసేపు ఉండి సేదతీరాలనిపిస్తుంది. పైనుండి కిందికి దూకే ఆ నీటి వయ్యారాలను అలా చూస్తూ వెళితే మధ్యలో ఒక చిన్న గుహ. అందులో ఏదో వెలుగు! ఆధ్మాత్మిక వాదులయితే దాన్ని ఎటర్నల్ ఫ్లేమ్‌గా పిలుస్తారు. సైంటిఫిక్ వాదులు దాన్ని నేచురల్ ఫ్లేమ్ అంటారు. ఈ ఫ్లేమ్ ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుంది. దాన్ని చూడాలంటే న్యూయార్క్ లోని షేల్‌క్రీక్ ప్రిజర్వ్‌లో ఉండే ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్‌దగ్గరికి వెళ్ళాల్సిందే. అమెరికా, న్యూయార్క్‌లోని షేల్ క్రీక్ ప్రిజర్వ్‌లో ఉండే జలపాతం కొండరాళ్ళపైనుంచి నీళ్లు కిందకి జాలువారే జలపాతం మధ్యలో చిన్న గూడులాంటి ప్రదేశంలో నిరంతరం ఓ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. గూటిలో రాయి కిందినుంచి వెలువడే సహజవాయువే ఈ జ్యోతికి కారణమని చెబుతున్నారు సైంటిస్టులు.

ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్, ఇటలీనేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్,అగ్నిపర్వతాల భౌగోళిక నిపుణులు 2013 లో ఎటర్నల్ ఫ్లేమ్ జలపాతాన్ని అధ్యయనం చేశారు. సహజంగా వెలువడే హైడ్రోకార్బన్ భాగాలనుండి విడుదలయ్యే సహజవాయువు వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువులతో కలిసి ఈ వెలుగు ఏర్పడుతున్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏది ఏమైనా ఈ ఫ్లేమ్‌ను చూసేందుకు పర్యాటకులు భారీగా కదలి వెళుతుంటారుట.

Comments

comments