Search
Friday 16 November 2018
  • :
  • :

గూగుల్‌పై యూరప్ 5 బిలియన్ డాలర్ల జరిమానా

goole

న్యూయార్క్: సంవత్సరం కాలంలో రెండోసారి గూగుల్‌పై యూరప్ కమిషన్ జరిమానా విధించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై అన్యాయంగా యాప్‌ల విషయంలో ఒత్తిడి తేవడం, పోటీదారులను అడ్డుకోవడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఈ జరిమానా విధించింది. భారీ మొత్తంలో 4.34 బిలియన్ యూరోలు(5 బిలియన్ డాలర్ల) జరిమానా విధించింది. గతేడాది కూడా గూగుల్ భారీ మొత్తంలో 2.8 బిలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందనే కారణంతో యూరప్ జరిమానా విధించింది. పోటీదారులను పైకి రానీయకుండా అడ్డుకోవడం, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు గూగుల్ యాప్స్‌నే వాడేలా గూగుల్ సంస్థ అనుచిత విధానాలను అవలంభిస్తోందని యూరప్ ఆరోపిస్తోంది. అమెరికన్ ప్రత్యర్థుల ఫిర్యాదులపై 2015 నుంచి విచారణ చేపట్టిన యూరప్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. గూగుల్‌తో పాటు గతంలో  ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌పైనా యూరోపియన్ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి. గూగుల్ ప్రస్తుతం యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించి, డివైజ్ విక్రయించడాని కంటే ముందస్తుగా స్మార్ట్‌ఫోన్లలో తన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తుందని కమిషన్ ఆరోపించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్ సంప్రదింపులు చేపడుతుందని,  తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ ఆదేశించింది.

Comments

comments