Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

20 శాతం తగ్గిన ఈవ్‌టీజింగ్

She-Team-Policeరెండేళ్లలో 4423 ఈవ్‌టీజింగ్ కేసులు
రద్దీ ప్రాంతాలలో సిసిటివి నిఘా
ఈవ్‌టీజింగ్ రహిత నగరంగా మారుస్తాం: స్వాతిలక్రా

మనతెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరాన్ని ఈవ్ టీజింగ్ రహితంగా మారుస్తామని అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా తెలిపారు. నగరంలో షీటీమ్స్ ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఈవ్‌టీజింగ్‌పై కూలంకశంగా వివరించారు. రెండే ళ్లలో షీటీమ్స్ ఆధ్వర్యంలో 4423 ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు చేశారన్నారు. 2014 సెప్టెంబర్ వరకు 1606 కేసులు నమోదు కాగా 2015లో 1521 కేసులు, ఏడా దిలో 1296 కేసులు నమోదయ్యాయి. షీటీమ్స్ రంగం లోకి దిగడంతో రెండేళ్లలో 20 శాతం కేసులు తగ్గా యన్నారు. రానున్న రోజుల్లో జీరో కేసులు ఉండే విధం గా షీటీమ్స్ లక్షమన్నారు. పట్టుబడిన వారిలో మైనర్లు 222 మంది ఉండగా 577 మంది మేజర్లు ఉన్నార న్నారు. వీరిలో 40 మందిపై నిర్భయ చట్టం కింద కేసు లు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇద్దరిపై పిడి యాక్ట్ ప్రయోగించామన్నారు. 33 మందిపై ఐటి యాక్ట్ కింద కేసులు పెట్టామన్నారు. ఇప్పటి వరకు 41 మందిని జైలుకు పంపామన్నారు. ఈవ్‌టీజింగ్‌పై నగరంలో 76 ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఇప్పటికే ఇంటర్ సెకండియర్‌లో షీటీమ్స్ పనితీరుపై పాఠ్యాంశం ఉందన్నారు.

డయల్ 100కు 1217, ఫేస్‌బుక్ ద్వారా 322, ఈ మెయిల్ ద్వారా 183, స్వయంగా 421, హాక్-ఐ ద్వారా 44, వాట్సాప్ ద్వారా 175 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈవ్‌టీజింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 18-20 ఏళ్ల వయసు ఉన్న వారు 41 శాతం, 21-40 ఏళ్ల వారు 35 శాతం, 41-55 ఏళ్ల వారు 0.67 శాతం 55 ఏళ్లకుపైబడిన వారు 0.33 శాతం మంది ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో షీటీమ్స్ పనితీరును పరిగణలోకి తీసుకున్న ఇతర రాష్ట్రాలు కూడా వారి వారి ప్రాంతా లలో షీటీమ్స్ ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరి స్సా, మహారాష్ట్ర, ఛతీస్‌ఘాడ్, రాజస్తాన్‌లలో షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఈవ్‌టీజింగ్‌పై వంద పాఠశాలలు, 300 ప్రైవేటు వర్కింగ్ ఉమెన్స్ హాస్ట ళ్లు, 200 కళాశాలలు, బస్‌స్టాపులు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, లేబర్ అడ్డాలు, స్లమ్స్ ఏరి యాలు, ఆర్‌టిసి బస్సులు, ఎంఎంటిఎస్ రైళ్లు, సెవన్ సీటర్స్ ఆటోలలో సైతం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించామన్నారు. కళాశాలలు మరియు మురికివాడల్లో షీటీమ్స్ ప్రతినిధిని ఏర్పాటు చేస్తామ న్నారు. వారి ద్వారా వచ్చే సమాచారం మేరకు షీటీమ్స్ రంగంలోకి దిగి ఈవ్‌టీజర్ల భరతం పడతాయన్నారు. ఈ సమావేశంలో సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి, అదన పు డిసిపి రంజన్త్రన్, ఎసిపి కవితలు పాల్గొన్నారు.

Comments

comments