Home రాష్ట్ర వార్తలు చిరు వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు వాడాలి : జూపల్లి

చిరు వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు వాడాలి : జూపల్లి

Jupally-Krishna-Raoనాగర్‌కర్నూల్ : జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై నిర్వహించిన సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, మండలాలను దత్తత తీసుకోవాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలపై రెండు నెలల్లోపు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
నగదు రహిత లావాదేవీలలో దేశంలోనే తెలంగాణ ముందుండాలని తెలిపారు. వ్యాపారస్తులు స్వైపింగ్ మిషన్లు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రేషన్‌షాపులు, రైలు బజార్లు, చిరు వ్యాపారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా లావాదేవీల జరపాలని. దీంతో త్వరితగతిన నగదు రహిత లావాదేవీలు సాధ్యమవుతాయని తెలిపారు.